కోస్టుగార్డులో 630 కొలువులు - పది, ఇంటర్, డిప్లొమాతో అవకాశం
కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారతీయ తీర రక్షక దళం 630 నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పది, ఇంటర్మీడియట్, డిప్లొమా విద్యార్హతలతో దరఖాస్తు చేసుకో వచ్చు. రాత, శరీరదార్థ్య, వైద్య పరీక్షలతో నియామకాలుం టాయి. ఎంపికైనవారికి శిక్షణ అనంతరం విధుల్లోకి తీసు కుంటారు. వీరు ఆకర్షణీయ వేతనంతోపాటు, భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు.
ఏటా రెండు సార్లు నావిక్, యాంత్రిక్ పోస్టులకు ఇండియన్ కోస్టు గార్డు ప్రకటనలు వెలువరిస్తోంది. పురుషులే అర్హులు. నాలుగు దశల్లో నిర్వహించే పరీక్షలతో నియామకాలుంటాయి.
నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్: 50 ఖాళీలున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు.
నావిక్ జనరల్ డ్యూటీ: 520 ఖాళీలు, వీటికి మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు.
యాంత్రిక్: మెకానికల్ 30, ఎలక్ట్రికల్ 11, ఎలక్ట్రానిక్స్ 19 ఖాళీలు. ఈ పోస్టులకు ఎలక్ట్రికల్/ మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ (రేడియో/ పవర్) విభాగాల్లో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసుకున్నవారు అర్హులు. వయసు: అన్ని పోస్టులకూ 18 నుంచి 22 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.
పరీక్ష ఇలా...
స్టేజ్-1: నావిక్, యాంత్రిక్ రెండు ఉద్యోగాలకూ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్షలు నిర్వహిస్తారు. రుణాత్మక మార్కులు లేవు. నాలుగు ఆప్షన్ల నుంచి సరైన సమాధానం గుర్తించాలి. మొత్తం 5 సెక్షన్లలో ప్రశ్నలు. ఆడుగుతారు. మూడు పోస్టులకూ సెక్షన్-1 ఉమ్మడిగా ఉంటుంది. ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే వస్తాయి. మొత్తం 60 మార్కులకు 60 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథ్స్ 20, సైన్స్ 10, ఇంగ్లిష్ 15, రీజనింగ్ 10, జీకే 5 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు, నావిక్ డొమెస్టిక్ బ్రాంచీ పోస్టులకు సెక్షన్-1 ఒక్కటే సరిపోతుంది. నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులకు సెక్షన్-2 ఆదనంగా రాయాలి. ఈ విభాగానికి 50 మార్కులు, 50 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 30 నిమిషాలు. ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్ ఒక్కో సబ్జె క్టులో 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
యాంత్రిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు సెక్షన్-1తో పాటు సెక్షన్ 3, 4, 5లలో చదువుకున్న డిప్లొమా బ్రాంచీ ప్రకారం ఏదో ఒకటి రాయాలి. ఎలక్ట్రికల్ విభాగంవాళ్ళు సెక్షన్-8, ఎలక్ట్రానిక్స్ బ్రాంచీ వారు సెక్షన్-1, మెకానికల్ డిప్లొమా అభ్య ర్థులు సెక్షన్-5 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో సెక్షన్కూ 50 మార్కులు, 50 ప్రశ్నలు వస్తాయి. వీటికి వ్యవధి 30 నిమిషాలు, డిప్లొమా సిలబస్ నుంచే ఈ ప్రశ్నలు అడుగుతారు. మాదిరి ప్రశ్నలు, సెక్షన్ల వారీ సిలబస్ వివరాలు కోస్టు గార్డు వెబ్సైట్లో ఉన్నాయి. ప్రతి సెక్షన్లోనూ కనీస మార్కులు పొందడం తప్పనిసరి. జనరల్, ఈడబ్ల్యుఎస్, ఓబీసీ విభాగాల వారు సెక్షన్-1లో 30, మిగిలిన సెక్షన్లలో 20 చొప్పున మార్కులు సాధిం చాలి. ఎస్సీ, ఎస్టీలు సెక్షన్-1లో 27, మిగి లిన సెక్షన్లలో 17 చొప్పున మార్కులు పొందితే అర్హులుగా పరిగణిస్తారు. ఇలా అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణంగా స్టేజ్-2కు ఎంపిక చేస్తారు.
స్టేజ్-2: ఇందులో భాగంగా 7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరం పరుగె త్తాలి. 20 గుంజీలు, 10 పుష్ప్స్ తీయగలగాలి. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. మార్కులు ఉండవు. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత చాతీ కొలతలో వ్యత్యాసం కనీసం 5 నెం.మీ. తప్పనిసరి,
స్టేజ్-3: స్టేజ్-2లో అర్హత సాధించిన వారిని స్టేజ్-1 మెరిట్తో స్టేజ్ -38 ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్ఎస్. చిల్కలో మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హులు తర్వాతి దశకు చేర తారు. స్టేజ్-1లో భాగంగా అభ్యర్ధుల ఒరిజినల్ ద్రువపత్రాలు పరిశీలించి, అన్నీ సరిగా ఉంటే శిక్షణకు తీసుకుంటారు.
శిక్షణ, వేతనం:
వీరికి ప్రాథమిక శిక్షణ ఐఎన్ఎస్ చిల్కలో ఉంటుంది. తర్వాత సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్ శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. యాంత్రిక్ ఉద్యోగాలకు ఎంపికై నవారికి లెవెల్-5 రూ.28,200 మూలవేతనం చెల్లిస్తారు. దీంతోపాటు రూ.6200 యాంత్రిక్ పే ఉంటుంది. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే వీరు రూ.50,000 అందుకోవచ్చు. పదో న్నతుల ద్వారా అసిస్టెంట్ చీఫ్ ఇంజినీర్ హో దాకు చేరుకోవచ్చు. నావిక్ (డొమెస్టిక్, జనరల్ డ్యూటీ) పోస్టుల్లో చేరినవారికి లెవెల్-3 రూ. 21,700 మూలవేతనం చెల్లిస్తారు. అన్ని ప్రోత్సా హకాలతో వీరు రూ.35 వేలకుపైగా జీతం పొంద వచ్చు. భవిష్యత్తులో ప్రధానాధికారి హోదాను అందుకోగలరు. నావిక్ డొమెస్టిక్ బ్రాంచీవారు కుక్, స్టివార్డ్ గా సేవలు అందిస్తారు. నావిక్ జీడీ విభాగంలో చేరినవారు కేటాయించిన ట్రేడుల్లో జనరల్ విధులు నిర్వర్తించాలి. యాంత్రిక్ ఉద్యో గులు షిప్ నిర్వహణ, మరమ్మతులు డిప్లొమా బ్రాంచీల ప్రకారం చూసుకుంటారు.
ఆన్లైన్ దరఖాస్తులు: జూన్ 25 రాత్రి 11:30 గంటల వరకు స్వీకరి స్తారు. ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీలకు లేదు.
పరీక్షలు: స్టేజ్-1 సెప్టెంబరులో నిర్వహిస్తారు. స్టేజ్-2 నవంబరు/ఫిబ్రవ రిలో, స్టేజ్-3 ఫిబ్రవరి/జులైలో ఉంటాయి.
స్టేజ్-1 పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. విజయవాడ, విశా ఖపట్నం, గుంటూరు, తిరు పతి, కాకినాడ. తెలంగాణలో.. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్,
వెబ్ సైట్: https://joinindiancoastguard.cdac.in/cgept/