పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మహారాష్ట్రలో 28 ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులు
మహారాష్ట్రలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ సూపర్వైజర్(సేఫ్టీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 28
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరిం గ్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ) లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 25.03.2025 నాటికి 29 ఏళ్లు ఉండాలి.
» వేతనం: నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000.
» ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.03.2025.
» వెబ్ సైట్: https://www.powergrid.in/