డేటా సైన్స్ అండ్ మేనేజ్మెంట్లో జాయింట్ ప్రోగ్రామ్
ఇండోర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనే జ్మెంట్ (ఐఐఎంఐ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీఐ) ఉమ్మడిగా నిర్వహి స్తున్న 'మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ డేటా సైన్స్ అండ్ మేనేజ్మెంట్ (ఎంఎస్ డీఎస్ఎం) ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. ఇది రెండేళ్ల వ్యవధిగల ఆన్లైన్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కు అనుకూ లంగా ఉంటుంది. రెగ్యులర్ అభ్యర్థులు, విదేశీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 200 సీట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. జాతీయ పరీక్ష స్కోర్/సంస్థ నిర్వహించే డీమ్యాట్ స్కోర్ ఆధారంగా షార్ట్స్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్ధులకు అడ్మిషన్స్ ఇస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్/బీ ఫార్మసీ/బీఆర్క్/బీడిజైన్/బీఎఫిక్/నాలుగేళ్ల బీఎన్స్ /ఎమ్మెస్సీ/ఎంసీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. గత మూడేళ్లలో నిర్వ హించిన క్యాట్/గేట్/జీమ్యాట్/జీఆర్ /జామ్ పరీక్షల్లో ఒకదానిలో అర్హత పొంది ఉండాలి. లేదంటే ఐఐటీ ఇండోర్ నిర్వహించే డేటా సైన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీమ్యాట్) 2024 రాయాల్సి ఉంటుంది.
డీమ్యాట్ 2024 వివరాలు: పరీక్ష ఆబ్జెక్టివ్ విధా నంలో ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ ఎబి లిటీ, డేటా ఇంట్రప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్య ర్థులు సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్ష సిలబస్ కోసం వెబ్సైట్ చూడవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ: ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం:
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 10
డీమ్యాట్ తేదీ: జూన్ 23
వెబ్సైట్: