నోటిఫికేషన్స్ : జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్ మ్యాట్)
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)- 'జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్మ్యాట్) 2024 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ద్వారా ఐఐఎం బోధ్ గయ, ఐఐఎం జమ్మూ ఉమ్మడిగా అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ (ఐపీఎం) లో ప్రవేశాలు కల్పిస్తారు. దీని వ్యవధి అయిదేళ్లు. ఇందులో లాంగ్వేజ్ స్కిల్స్, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్ మెంట్ స్టడీస్కు సంబంధించిన ఫౌండేషనల్ సబ్జెక్టులు, ఎథికల్ అండర్ స్టాండింగ్ అంశాలు బోధిస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఆర్ట్స్/కామర్స్/ సైన్స్ గ్రూపులతో ఇంటర్/పన్నెండోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. 2022, 2033 సంవత్సరాల్లో ఇంటర్/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణు లైనవారు, ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి స్థాయిలో కూడా. కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. రిజర్వ్డ్ వర్గాల అభ్యర్ధులకు 55 శాతం మార్కులు చాలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎన్ఐఓఎస్)/ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుంచి ఇంగ్లీష్ సహా ఏవేని అయిదు సబ్జెక్టులతో సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులు కూడా దర ఖాస్తు చేసుకోవచ్చు.
జిప్ మ్యాట్ వివరాలు: దీనిని సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. క్వాంటిటే టివ్ ఆప్టిట్యూడ్ నుంచి 33, డేటా ఇంట్రప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 33, వెర్సల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 34 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు. నాలుగు మార్కులు కేటాయించారు. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.2000, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 21
కరెక్షన్ విండో ఓపెన్: ఏప్రిల్ 23 నుంచి 25 వరకు
అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడింగ్: జూన్ 2 నుంచి
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.
జిప్మ్యాట్ 2024 తేదీ: జూన్ 6
వెబ్ సైట్: https://exams.nta.ac.in/JIPMAT/