Type Here to Get Search Results !
🔥 Latest Jobs

కంప్యూటర్ వాడేవాళ్ళు ఆరోగ్యపరంగా గుర్తుంచుకోవలసినవి. డా॥ ఇవటూరి రామకృష్ణ.

కంప్యూటర్ వాడేవాళ్ళు ఆరోగ్యపరంగా గుర్తుంచుకోవలసినవి. డా॥ ఇవటూరి రామకృష్ణ. 



అయ్యా! నెలరోజుల నుంచి కణతలునొప్పి, మెడనొప్పి... ఏమిటేమిటో బాధలు, కళ్ళు చిట్లించుకొని చూడాలనిపిస్తుంది... ఇలా ఎంతో మంది నడివయస్సు రాకుండానే బాధపడు తుంటారు. ఇది కనిపించని దెబ్బ తగలటంవల్ల వచ్చిన లక్షణాలు. రోజులో చాలాసేపు కంప్యూ టర్తో వుండి పనిచేసుకునేవాళ్ళకు తగిలే తెలియని దెబ్బ ఇది. దీనిని CRI (Computer rela- ted injury) అని అంటారు.

ఇది మనం బాధపడే సమయం. చాలా నెమ్మదిగా రావటం వల్ల ఆలస్యంగా గుర్తిస్తాం. ఈ రోజు మన జీవన యానంలో దాదాపు ప్రతిరంగంలోనూ, ప్రతి పనిలోను, ఆఖరికి ఆటల్లోను కంప్యూటర్ లేకుండా జరగటంలేదు. ఈనాటి లెక్కల ప్రకారం మన దేశంలో, నగరాలలో సూరుశాతం ఇండ్లలో కంప్యూటర్ వాడకం ఉంది. చాలా ఇళ్ళల్లో ఒకటికన్నా ఎక్కువ ఉన్నాయి.

మీకు తెలుసో తెలియదో కాని కొన్ని ఇళ్ళల్లో పడక గదిలోను, హాలులోను చివరికి వంటింట్లో కూడా కంప్యూ టర్ ఉంది, ఆఫీసుల్లో అయితే సరేసరి. ఇదంతా ఎందు కంటే చాలాసేపు కంప్యూటర్ వాడటం వల్ల శరీరంలో పలుచోట్ల దెబ్బ (injury) తగిలే అవకాశం ఉంది.. ఎందుకంటే మెడ, నడుం వంచుకొని చాలాసేపు ఒకే రకంగా కళ్ళు కదల్చకుండా కూర్చోవడంవల్ల కొన్ని అవ యవాలకి రక్తప్రసారం తగ్గి కండరాలు, ఎముకలు, కండ రాల చివరలు బిగపట్టి నొప్పిని కలుగచేస్తాయి.

పరిశోధనలలో ఇంకా తేలలేదు కాని ఉత్పత్తి పెరుగు తుందని, పని సామర్థ్యం పెరుగుతుందని అనిపించే ఈ కంప్యూటర్ నిరంతర వాడకం, మనిషి ఆయు:సరిమా ణంపైకూడా ప్రభావం చూపిస్తుంది.

అందుకే అంటున్నాను కంప్యూటర్ మనకి అత్యవసరం కనుక దానివల్ల వచ్చేటువంటి అనర్థాల నుండి కూడా మనని మనం పరిరక్షించుకోవాలి అని, సుమారు అయిదు సంవత్సరాల నుండి కంప్యూటర్ వాడకంవల్ల వచ్చే బాధలు మనదేశంలో గుర్తించబడ్డాయి. ఇప్పుడు అది పెరిగి ప్రపంచవ్యాప్తమైంది.

అన్ని వయసులవారికీ

చాలామంది కుర్రవాళ్ళు, చిన్నవయస్సు ఆడపిల్లలు నడివయస్సువారు వేలమంది ఆరోగ్యవంతులు నీరసం, నిష్పత్తువ వంటి రకరకాల బాధలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా RSI అంటే (Respective strain injury) పని ఒత్తిడివల్ల వచ్చే బాధలని అర్థం.

మేద, వీపు, భుజాలు, కాళ్ళు, చేతులు, మడమలు, (వ్రేళ్లు ఇవి తిమ్మిరెక్కడం, లాగుతున్నట్లనిపించడం జరుగుతుంది. నెదర్లాండ్స్ Hagwe 2000 పరిశోధనలో ఇది చాలా జాగ్రత్త వహించవలసిన స్థితి అని చెప్పారు. RSI ఎలాంటివాళ్ళలో రావచ్చు? 

• రాత్రి, పగలనక కంప్యూటర్ తో పనిచేసేవాళ్ళు, వైద్య నిపుణులు, నర్సులు నిరంతరం డ్యూటీ చేసేవాళ్ళు.

• చిన్నపనీ, పెద్దపనీ అని లేకుండా ఎప్పుడూ ఇంట్లో పనిచేసుకునే పెద్దవాళ్లు.

కారణాలు: 

• ఒకేస్థితిలో చాలాసేపు ఉండటం చాలా సేపు చేతిని కదుపుతూవుండటం, బలహీనమైన స్థితిలో చాలాసేపు ఉండటం, 

• కండరాల ఒత్తిడి చాలా సేపు ఉండేటట్లు కూర్చోడం లేదా బోర్లాపడుకోవడం, 

• చాలాసేపు ఏ.సిలో వుండటం, * అనువుకాని సులువు లేని కుర్చీల్లో, సోపాల్లో, మంచాలపై ఉండటం, కళ్ళు వెడల్పు చేసుకొని చూడటం.

లక్షణాలు: 

• హఠాత్తుగా నిస్సత్తువ, అక్కడా ఇక్కడా అని లేకుండా నొప్పి, మెడ, కాళ్ళు, చేతులు, వీపు, నడుములో కొద్దిగా వాపునొప్పి, పైచోట్ల పొడుస్తున్నట్లుం చటం, తరచూ తిమ్మిరిగా ఉండటం, క్రమక్రమంగా చేతపట్టు లేకుండావుండటం, నుదురు,. అరచేతులు మంటగా ఉండటం, సూదులు పొడిచినట్లనిపించడం, కళ్ళు అలసటచెంది సైరెప్పలు రాలుతూవుండటం చూపుతగ్గడం (CVS), రోజూ మనం చేసుకునే పనుల్లో సామర్థ్యం తగ్గడం. 

• సంసారంలో అనురక్తి తగ్గడం. తరచూ తలనొప్పి రావడం.

మరి ఇవన్నీ వస్తున్నాయని కంప్యూటర్ వాడకం మానె య్యాలా? అక్కరలేదు, దానివల్ల వచ్చే బాధలనుంచి మనని మనం పరిరక్షించుకోవాలి. ఆవీ దినచర్యలో చిన్న చిన్న మార్పులు చేసుకుని, కంప్యూటర్ వాడుతున్నప్పుడు ముఖ్యంగా కాళ్ళు, మెడ, మన నడుం ఒకే స్థితిలో చాలా సేపు ఉండకుండా చూసుకోవాలి.

బయటపడేదెలా...

• కంప్యూటర్ చాలా సేపు వాడవలసివస్తే ముందుకు ఒంగి చాలాసేపు కూర్చోకుండా నడుమును వెనుకకు వాల్చి కొంతసేపు ఉండండి. మీరు 'మౌస్' (Mouse)ని వాడేటప్పుడు ప్రతి అరగంటకి చేతికి కాస్త విశ్రాంతినిచ్చి మోచేయి, వేళ్ళు, పైనించి కిందకు చేత్తో మర్దన చేసుకోండి. 

• కంప్యూటర్ తెర సాధ్యమైనంతవరకు మీ నుదురుకు సమాన ఎత్తులో ఉండేటట్లు చూసుకోండి. 

• కాళ్ళు బిగదీసుకుని వుంచకుండా నేలపై చాసివుం చండి. వేళ్ళు కదుపుతూవుండండి.

ఆయుర్వేదం వీటికి చక్కని ఉపాయాలని ప్రతిపాదిం ఉంది. నాడు జనపదవ్యాధులుగా అనబడే వీటికి నేటికీ అన్వయం చేసుకుంటే చక్కటి వైద్యం మనకి లభిస్తుంది. దీంతో అందరూ చేసుకోతగ్గది అభ్యంగస్వేదం. అభి అంటే లోపలకి లేదా ముందుకి అని అర్ధం. అంగ అంటే అన్ని అవయవాలు కదలికలలోకి అని అర్థం. స్వేదమంటే చెమటపట్టించడం అవి. కనీసం 45 నిమిషాలు శరీరమం తటినీ నువ్వులనూనెతో మర్దన చేసుకోవాలి.

దీనివల్ల కండరాలు, ఎముకలు, నరాలు అన్నీ క్లేదపడి మలినాలని బయటకు తెచ్చి కొత్తశక్తి వస్తుంది.ఇలా ప్రతి రోజూ చేసుకుంటే మంచి నిద్రపడుతుంది.

అలాగే మంచి పంచకర్మ విభాగంలో లలక్కిజి శిరో ధార, అక్షితర్పణం వంటివి నెలకో, రెండు నెలలకో ఒక్క సారి చేయించుకుంటే మెడ, నడుము, చేతులు, కళ్ళు నిర్మలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల వాళ్ళు, వాళ్ళ ఉద్యోగులు ఆనందంగా ఉండా లంటే, వాళ్ళకి ఆయుర్వేద సహజపద్ధతులని తెలియ జెప్పే అవకాశాలు కలుగచేయడం అవసరం.

ఆయుర్వేద చిట్కాలు:

• వారానికి ఒక్కసారయినా రాత్రి పడుకునే ముందు ముక్కుకి కొబ్బరినూనె రాసు కుని పడుకుంటే ముక్కు ఎండిపోకుండా మచ్చలు రాకుండా ఉంటుంది.

• సైనసైటిస్ ఉన్నవాళ్ళు రెండుచుక్కలు నువ్వులనూనె ముక్కులో వేసుకొని లోపలికి పీలిస్తే హాయిగా ఉంటుంది.

• నోరు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తీసుకున్న వెంటనే నీళ్ళతో పుక్కిలించి వదిలేయండి. దాంతో నోట్లో మిగిలివున్న పదార్థాలన్నీ బయటికొచ్చి నోరు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

* ఉసిరికపొడి కాని, త్రిఫలచూర్ణంతో కాని, తులసి ఆకులపొడితోకాని నెలకు అయి దారుసార్లు పళ్ళచిగుళ్ళు ధావనం అంటే రుద్దుకోవడం చాలా మంచిది.

సందేహం:

ప్రశ్న: నా వయస్సు 24 సంవత్సరాలు, ఇంజనీరింగు చేస్తున్నాను. నా ముఖంపై ముడుతలు, చిన్నచిన్న గుంటలు, నల్లటి చిన్నచిన్న మచ్చలు వున్నాయి. అవి పోవాలంటే ఏంచేయాలి?

జవాబు: ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. కానీ చాలా ఖరీదు అవుతుంది. నిమ్మరసంలో బార్లీపిండి, మినప సిండి కలిపి ముఖానికి పట్టులా వేసుకుని రెండు గంటల తర్వాత కడుక్కోండి. వారం తర్వాత బంగాళాదుంప ఉడికించి పాలతో కలిపి ముద్దగా చేసుకుని ముఖానికి రాసుకోండి. పావుగంట తర్వాత కడిగేసుకుంటే ముడతలు, గుంటలు వంటివి లేకుండా చక్కగా ఉంటుంది.

- కె.మల్లీశ్వరి, నిజామాబాద్.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area