Type Here to Get Search Results !

హైదరాబాద్ ఐఐటీలో పీ జీ, పీ హెచ్ డి

హైదరాబాద్ ఐఐటీలో పీ జీ, పీ హెచ్ డి 



హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీహెచ్)- పీజీ, పీహెచ్ డీ ప్రోగ్రామ్ లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీలో ఎంఏ, ఎంటెక్, ఆన్లైన్ ఎంటెక్, ఎం డిజైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు, నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఎం.డిజైన్ ప్రోగ్రామ్ రెగ్యులర్, ఆన్లైన్ విధా నాల్లో ఉంది. ఎమ్మెస్సీ మెడికల్ ఫిజిక్స్ ప్రోగ్రామ్ను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్-రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ సహకారంతో నిర్వహిస్తున్నారు. కోర్సు వ్యవధి మూడేళ్లు, పీహెచ్డీ ప్రోగ్రామ్ వ్యవధి అయిదేళ్లు, ఫెలోషిప్ సౌకర్యం ఉంది. ప్రోగ్రామ్ లకు నిర్దేశించిన మేరకు గేట్/సీడ్ వ్యాలిడ్ స్కోర్ లేదా అకడమిక్ ప్రతిభ, జేఆర్ఎఫ్ అర్హత ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి రాత పరీక్ష/ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్ ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. టీచింగ్ అసి స్టెంట్ షిప్, రీసెర్చ్ అసిస్టెంటివ్ త్రూ ప్రాజెక్ట్, సెల్ఫ్ స్పాన్సర్డ్, గవర్నమెంట్ స్పాన్సర్డ్, ఆన్ లైన్ ప్రోగ్రామ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తదితర కేటగిరీల్లో అడ్మిషన్స్ ఇస్తారు.

రెగ్యులర్ ఎంటెక్ స్పెషలైజేషన్లు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, క్లయిమేట్ ఛేంజ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరి యల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్, టెక్నో, ఆంత్రప్రెన్యూర్షిప్, క్వాంటమ్ అండ్ సాలిడ్ స్టేట్ డివైసెస్, ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ-వేస్ట్ రిసోర్స్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, సస్టయినబుల్ ఇంజనీరింగ్

ఆన్లైన్ ఇంటర్ డిసిప్లినరీ ఎంటెక్ స్పెషలైజేషన్లు: ఇంటిగ్రేటెడ్ కంప్యూటేషనల్ మెటీరియల్స్. ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ,

ఇంటర్ డిసిప్లినరీ ఎంటెక్/ఎమ్మెస్సీ స్పెషలైజేషన్లు: అడిటివ్ మాన్యుఫాక్చరింగ్, మెడికల్ డివైజ్ ఇన్నోవేషన్, స్మార్ట్ మొబిలిటీ, ఆప్తాల్మిక్ ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ మైక్రో సిస్టమ్స్ ప్యాకేజింగ్, మెడికల్ ఫిజిక్స్

ఆన్లైన్ ఎంటెక్ స్పెషలైజేషన్లు: కంప్యూటేషనల్ మెకానిక్స్, కమ్యూనికేషన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సిస్టమ్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ, ఇండస్ట్రియల్ మెటలర్జీ, డేటా సైన్స్, హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

ఎంఏ స్పెషలైజేషన్లు: డెవలప్మెంట్ స్టడీస్, హెల్త్ జెండర్ అండ్ సొసైటీ

అర్హత వివరాలు: ఎంఏ ప్రోగ్రామ్నకు కనీసం 55 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, ఎండిజైన్ ప్రోగ్రామ్నకు ఇంటర్ తర వాత కనీసం 55 శాతం మార్కులతో ఇంజనీరిం గ్/ఆర్కిటెక్చర్/ డిజైన్/ఇంటీరియర్ డిజైన్ విభా గాల్లో నాలుగేళ్ల డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సీడ్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి. ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ డిజైన్ (ఎన్ఐడీ/సీఈపీటీ), బీఎస్ఏ అభ్య ర్థులూ అర్హులే. పదోతరగతి ఉత్తీర్ణత తరవాత అయిదేళ్ల జీడీ ఆర్ట్ ప్రోగ్రామ్ పూర్తి చేసినవారు పీజీ(ఆర్ట్స్/ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్) ఉత్తీర్ణత తోపాటు ప్రొఫెషనల్ అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంటెక్ ప్రోగ్రామ్ నకు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ/ఎంబీబీఎస్/బీడీ ఎస్/బీఫార్మసీ/బీవీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎమ్మెస్సీ(మేథ్స్/ అప్లయిడ్ మేట్స్/ పిజిక్స్/ కెమిస్ట్రీ/ మెటీరియల్ సైన్స్)/ ఎంసీఏ అభ్యర్థులూ అర్హులే. గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. సీఎఫ్ఐ సంస్థల నుంచి 9 కన్నా ఎక్కువ సీజీపీఏ; నిట్, ఐఐటీ, ఐఐఐటీ సంస్థల నుంచి 8 కన్నా ఎక్కువ సీజీపీ ఏతో బీఈ/బీటెక్/ఎంసీఏ / ఎమ్మెస్సీ పూర్తి చేసిన అభ్యర్థులను గేట్ స్కోర్నుంచి మినహాయించారు. వీరు పీజీ, పీహెచ్ఎ ప్రోగ్రామ్లలకు నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు. ఎమ్మెస్సీ మెడికల్ ఫిజిక్స ప్రథమశ్రేణి మార్కులతో బీఎస్సీ (ఫిజిక్స్) ఉత్తీర్ణత తోపాటు జామ్ 2024 స్కోర్/ఇన్స్పయిర్ స్కాల రేప్ అర్హత ఉండాలి.

పీ హెచ్ డి 

స్పెషలైజేషన్ విభాగాలు: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నా లజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీ రింగ్, క్లయిమేట్ చేంజ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిజైన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంజ నీరింగ్ సైన్స్, ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్ మెంట్, హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లిబరల్ ఆర్ట్స్, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, మేథమెటిక్స్, మెకానికల్ అండ్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్, పిజిక్స్, సన్దయినబులిటీ అర్హత: ఎంచుకొన్న విభాగాన్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్తో ఎంఈ/ఎంటెక్/ఎం. ఎస్/ఎండీ/ఎండీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంసీ. ఏ/ ఎమ్మెస్సీ/ సంబంధిత మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి నవారు: ఎంబీబీఎస్/బీడీఎస్/బీఈ/బీటెక్ అభ్య ర్థులూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిజైన్ విభాగానికి ఎం డిజైన్/ఎంఆర్క్/ఎంఫిల్/ఎంఎఫ్ ఏ/ ఎంఏ/ ఎమ్మెస్సీ/ నిడ్ నుంచి పీజీ డిప్లొమా ఇన్ డిజైన్ పూర్తిచేసి ఉండాలి. గేట్/సీడ్/సీఎస్ ఆర్ నెట్ జేఆర్ఎఫ్/యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/డీ బీటీ జేఆర్ఎస్/ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్/డీఎస్టి-ఇ న్స్పయిర్ పరీక్షల్లో అర్హత పొందినవారికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలు/ ల్యాబొరేటరీల్లో పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుంది.

ముఖ్య సమాచారం:

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500, మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: పీజీ ప్రోగ్రామ్ కు ఏప్రిల్ 8, పీ హెచ్ డి కి ఏప్రిల్ 11

వెబ్ సైట్: iith.ac.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area