Type Here to Get Search Results !

మేటి సంస్థల్లో ఎంసీఏ (నిమ్ సెట్-2024)

మేటి సంస్థల్లో ఎంసీఏ (నిమ్ సెట్-2024)



» నిట్ క్యాంపస్లో ఎంసీఏ ప్రవేశాలకు నిమ్ సెట్ 

» నిట్లో ఎంసీఏతో ఐటీలో దీటైన కెరీర్ అవకాశాలు

» నిమ్ సెట్- 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

పీజీ స్థాయిలో కంప్యూటర్ స్పెషలైజే షన్ సాఫ్ట్వేర్ రంగంలో కెరీర్ కోరుకునే వారికి చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది. దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ నిట్లో ఎంసీఏలో అడ్మిషన్స్కు నోటిఫికేషన్ విడుదలైంది. నిట్లు నిర్వహించే నిమ్ సెట్ లో స్కోర్తో ప్రవేశం సొంతం చేసుకోవచ్చు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి నిమ్ సెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నిమ్సెట్ ప్రత్యేకత. ఎంపిక విధానం, పరీక్ష ప్యాట్రన్, సిలబస్ విశ్లేషణ, ఎంసీఏతో కెరీర్ అవకాశాలు తదితర వివరాలు...

మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్.. సంక్షిప్తం గా ఎంసీఏ. ఈ కోడ్స బ్యాచిలర్ డిగ్రీ తర్వాత కం ప్యూటర్ పీజీకి చక్కటి మార్గం. ఎంసీఏను బెస్ట్ ఇన్ స్టిట్యూట్స్లో చదివేందుకు అవకాశం కల్పిస్తుంది. నిమ్ సెట్. దేశంలో ఇంజనీరింగ్ కోడ్సలను ఆం దించడంలో మంచి పేరున్న నిట్లు.. వీజీ స్థాయిలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఆప్లికేషన్స్ కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షనే.. నిటి ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నిమ్ సెట్),

11 క్యాంపస్లు. 1,033 సీట్లు:

నిమ్ సెట్ ర్యాంకు ఆధారంగా ప్రస్తుతం 11 నిట్ క్యాంపస్లో ఎంసీఏలో ప్రవేశం కల్పిస్తున్నారు. అగ ర్తల-30 సీట్లు, అలహాబాద్-116 సీట్లు, బోపాల్- 115, జంషెడ్పూర్- 115, కురుక్షేత్ర-64, కురు క్షేత్ర (సెల్ఫ్ ఫైనాన్సింగ్) 32, రాయపూర్ 110, సూరత్కల్-58, తిరుచిరాపల్లి-115, వరంగల్- 58, బోపాల్ -60, పాట్నా (డేటా సైన్స్, ఇన్ఫర్మా టిక్స్- 40, పాట్నా (ఏఐ అండ్ ఐఓటీ) -40 సీట్లు ఉన్నాయి. వీటితోపాటు నిట్ పాట్నాలో డేటా సైన్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం లో 40, అదే విధంగా ఐఏ అండ్ ఐఓటీలోనూ సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో మరో 40 సీట్లు అం దుబాటులో ఉన్నాయి. నిట్ సూరత్ కల్, నిట్-వ రంగల్ క్యాంపస్లు మూడేళ్ల వ్యవధిలో ఎంసీఏ ప్రోగ్రామ్ను అందిస్తూ.. రెండో ఏడాది తర్వాత ఎగ్జిట్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. రెండేళ్ల తర్వాత మానేయాలనుకునే వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఆప్లికేషన్స్ సర్టిఫికెట్ను అందిస్తారు.

అర్హతలు:

మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్లోలో ఏదో ఒకటి ప్రధాన సబ్జెక్ట్గా 60 శాతం మార్కులు / 6.5 సీజీపీ ఏతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ అభ్య ర్థులు 55 శాతం మార్కులు లేదా 6 జీపీఏ పాండా లి) ఉండాలి. (లేదా) బీఈ/ బీటెక్ చదివిన వారు కూడా నిమ్సేట్-20024కు దరఖాస్తు చేసుకోవచ్చు. బీబీఏ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు ఉత్తీర్ణులు కూడా దరఖాస్తుకు అర్హులే. అదే విధంగా అర్హత కోర్సు చివరి సంవత్సరం/సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు సెప్టెంబర్ 30 లోవు సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది.

3 విభాగాలు. 1000 మార్కులు:

నిమ్సిట్ వరీక్ష ఆన్లైన్ విధానంలో మొత్తం మూడు విభాగాల్లో వేయి మార్కులకు ఉంటుంది. మొదటి విభాగులో మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు-600 మార్కులకు అడుగుతారు. రెండో విభాగంలో అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు-240 మార్కులకు ఉం టాయి. మూడో విభాగులో కంప్యూటర్ అవేర్రెస్ 230 ప్రశ్నలు-120 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ 10 ప్రశ్నలు-40 మార్కులకు అడుగుతారు. నెగెటివ్ మార్కుల విధానం ఉంది. పరీక్ష వ్యవధి రెండు గం టలు..

ఉమ్మడి కౌన్సెలింగ్ అడ్మిషన్:

నిమ్ సెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిం చే 11 నిట్లు ఆన్లైన్ విధానంలో ఉమ్మడి కౌన్సె లింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తాయి. అభ్యర్థులు నిమ్ సెట్ ర్యాంకు ఆధారంగా నిమ్సిట్ వెబ్సైట్లో ఆన్లైన్ ఆడ్మిషన్ అప్లికేషన్ను పూర్తి చేయాలి. ఇలా ఆప్లికేషన్ పూర్తి చేసే సమయంలోనే ప్రాధాన్యతా క్రమంలో తమకు ఆసక్తి ఉన్న ఇన్స్టిట్యూట్లను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులకు వచ్చిన ర్యాం కు. ఎంచుకున్న ఇన్స్టిట్యూట్లు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఆన్లైన్లోనే సీట్ అలాట్ మెంట్ చేస్తారు.

ఉజ్వల అవకాశాలు:

నిమ్సిట్ ద్వారా నిట్ ఎంసీఏలో ప్రవేశం పొందితే ఉజ్వల భవిష్యత్తుకు మార్గం ఏర్పడినట్లే!. ఈ కోర్సు బోధనలో నిట్లు అనుసరిస్తున్న ప్రమా ణాలు, నాణ్యత కారణంగా విద్యార్థులకు కంప్యూ టర్ అప్లికేషన్స్, ఇతర సాఫ్ట్వేర్ అంశాలపై అవగా హన ఏర్పడుతుంది. దీంతో వీరికి సీఎస్ఈ అభ్యర్థు లకు దీటుగా అవకాశాలు లభిస్తున్నాయి. గత మూడేళ్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. సదరు నిట్లో ఎంసీఏ పూర్తి చేసుకున్న వారిలో నూటికి తొంభై శాతం మందికి క్యాంపస్ ప్లేస్మెం ట్స్ ఖరారవుతున్నాయి. అదే విధంగా వేతనాలు కూడా సగటున రూ. ఆడ లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు లభిస్తున్నాయి.

ముఖ్య సమాచారం:

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2024, ఏప్రిల్ 20.

ఆన్లైన్ దరఖాస్తు సవరణ: 2024, ఏప్రిల్ 24-ఏప్రిల్ 26.

అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: మే 28 - జూన్ 8. 

నిమ్సెట్ పరీక్ష తేదీ: 2024, జూన్ 8 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్  

వెబ్ సైట్: www.nimcet.in

బెస్ట్ స్కోర్కు మార్గాలు:

మ్యాథమెటిక్స్:

ఈ విభాగానికి సంబంధించి విద్యార్థులు తమ బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోని మ్యాథమెటిక్స్ పుస్తకా లను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా సెట్ థియరీ, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, అల్జీబ్రా, కో ఆర్డినేట్ జామెట్రీ, కాలిక్యులస్, వెక్టార్స్, ట్రిగ్నోమెట్రీలపై వూర్తి స్థాయిలో అవగాహన పెం చుకోవాలి. వీటిలో సంబంధిత అంశాల కాన్సె ఫ్లు, ఆప్లికేషన్పై వట్టు సాధించాలి. ప్రాక్టీస్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా సైంట్ ఫిక్ కంప్యూటర్ కాలిక్యులేటర్పై అవగాహన పెం చుకోవాలి.

అనలిటికల్ ఎబిలిటీలాజికల్ రీజనింగ్:

అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనిం గ్.. నిమ్సిట్లో మరో కీలక విభాగం. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే... అభ్యర్థులు విశ్లేషణ నైపుణ్యా లను, అదే విధంగా తార్కిక ఆలోచనను పెంచుకోవాలి.

ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలను చదు వుతూ ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా నిమ్సిట్ గత ప్రశ్న పత్రాల సాధన కూడా ఉపకరిస్తుంది.

కంప్యూటర్ అవేర్ నెస్:

అభ్యర్థుల్లోని కంప్యూటర్ బేసిక్ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. కంప్యూ టర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఆప్లికేషన్కు సంబంధిం చి బేసిక్స్పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా డేటా రిప్రజెంటేషన్ అంశాలపైనా పట్టు సాధించాలి.

జనరల్ ఇంగ్లిష్:

అభ్యర్థుల్లోని ఇంగ్లిష్ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది, ఇందులో మంచి మార్కులు పొంద దానికి కాంప్రహెన్షన్, వొకాబ్యులరీ, బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ అంశాలపై పట్టు సాధించాలి. ఇందు కోసం కాంపిటీటివ్ ఇంగ్లీష్ టెస్ట్ బుక్సు అధ్యయనం చేయాలి. నీటితోపాటు కాంప్రెహ న్షన్ కోసం ఇంగ్లిష్ న్యూస్ పేవర్లను చదవడం మంచింది.

ప్రాక్టీసు ప్రాధాన్యం:

అభ్యర్థులు రీడింగ్తో పాటు ప్రాక్టీస్కు కూడా ప్రిపరేషన్లో ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు తాము చదివిన అంశాలకు సంబంధించి ప్రశ్నార్హ మైన వాటిని గుర్తించి సెల్ఫ్ టెస్ట్లు రాసుకోవాలి. అదే విధంగా మాక్ టెస్ట్లు, మోడల్ టెస్ట్లు రాయడు కూడా ఎంతో మేలు చేస్తుంది..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area