Type Here to Get Search Results !

మేటి అవకాశాలకు.. మారిటైమ్ కోర్సులు

 మేటి అవకాశాలకు.. మారిటైమ్ కోర్సులు



ఎన్నో ఉత్పత్తులు ఖండాలు, దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నాయి. ఇందులో కీలకం రవాణా, తక్కువ ఖర్చుతో, అధిక పరిమాణంలో వస్తువులను చేరవేయడానికి జల రవాణాను మించిన మార్గం లేదు. ఇందులో కీలకం సముద్రమే. పెద్ద తీరరేఖ ఉండటం మనదేశ ప్రత్యేకత. దీంతో పోర్టులు విస్తరిస్తున్నాయి. కొత్తవి ఏర్పాటవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ షిప్పింగ్ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి మేటి అవకాశాలు అందిస్తున్నాయి. ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారికోసం ప్రత్యేక సంస్థలు వెలిశాయి. వాటిలో పలు కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. మన దేశంలో ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ఈ విభాగంలో ముఖ్యమైన సంస్థ. ఇందులో డిప్లొమా, యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆ వివరాలు.

మన దేశంలో 12 మేజర్, 200కు పైగా నాన్ మేజర్ పోర్టులు ఉన్నాయి. దేశం వెంబడి సుమారు 7500 కి.మీ. తీర రేఖ ఉంది. దేశ ఆర్థిక వృద్ధిలో సముద్ర రవాణా. కీలక పాత్ర వహిస్తోంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా నౌకాయానానికి ప్రాధాన్యమూ పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో భారీస్థాయిలో సామగ్రిని జల మార్గం గుండా దేశాలు, బండాలు దాటి లక్ష్య ప్రాంతాలకు చేర్చడంలో.. నౌకలు, నిషణుల పాత్రే కీలకం. ఈ విభాగంలో సేవలు అందిస్తున్న వారు ఆకర్షణీయ వేతనాలు పొందుతున్నారు. కష్టపడాలనే స్వభావం, సముద్రయానంపై ఆసక్తి ఉన్నవారు ఇండియన్ మారిటైమ్ విశ్వ విద్యాలయం, అనుబంధ సంస్థలు అందించే కోర్సుల్లో చేరేందుకు ప్రయత్నించవచ్చు. 

షిప్పింగ్లో సుశిక్షితులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2008లో చెన్నైలో ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీని నెలకొల్పింది. దీనికి నవీ ముంబై, ముంబై పోర్టు, కోల్కతా, విశాఖ పట్నం, కోచిల్లో క్యాంపస్లు ఏర్పాటుచేశారు. వీటికి దేశవ్యాప్తంగా 18 అనుబంధ కళాశాలలూ నెలకొల్పారు. వీటిలో 15కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ పరీక్ష ప్రతిభతో అవకాశం లభిస్తుంది. వీటిని పూర్తిచేసుకున్నవారు కెప్టెన్, షిప్ బిల్డర్, డిజైనర్, పోర్ట్ మేనేజర్, లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్, మెరైన్ ఆపరేషన్స్ మేనేజర్, మెరైన్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్, మెరైన్ టెర్మినల్ మేనేజర్, షిప్పింగ్ ఏజెంట్, డెక్ ఆఫీసర్, మెరైన్ పైలట్, మెరైన్ టెక్నిషియన్, మెరైన్ ఇంజినీర్, ప్రాజెక్ట్ మేనేజర్, మెరైన్ సర్వేయర్, కన్సల్టెంట్, నావల్ ఆర్కిటెక్ట్, రిసెర్చ్ సైంటిస్ట్.. తదితర హోదాలతో సేవలు అందించవచ్చు. ఇక్కడి విద్యార్థులను సలు. షిప్పింగ్ సంస్థలు ప్రాంగణ నియామకాల్లో అవకాశం కల్పిస్తున్నాయి. వీరు ఆనోర్, ఆఫ్ షోర్ విధులు నిర్వర్తించవచ్చు.

ఇవీ కోర్సులు...

అండర్ గ్రాడ్యుయేట్.

బీటెక్: మెరైన్ ఇంజినీరింగ్, నావల్ అర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్ బీబీఏ: లాజిస్టిక్స్ రిటైలింగ్ అండ్ ఇ-కామర్స్ మెరైన్ లాజిస్టిక్స్

బీఎస్సీ: నాటికల్ సైన్స్ షిప్ బిల్డింగ్ అండ్ రి పేర్

డిప్లొమా: నాటిరల్ సైన్స్ (కోర్సు వ్యవధి ఏడాది) 

అర్హత: బీఎస్సీ, బీటెక్, డిప్లొమా కోర్సులకు ఇంటర్లో 100 శాతం మార్కులతో ఎంపీసీ గ్రూపు ఉత్తీర్ణులు అర్హులు. అలాగే పదోతరగతి లేదా ఇంటర్ ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.. బీబీఏ కోర్సులకు 60 శాతం! మార్కులతో ఇంటర్ అన్ని గ్రూపుల విద్యార్థులూ అర్హులే.

పీజీలో..

ఎంటెక్: నావల్ అర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్ డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజినీరింగ్, మెరైన్ టెక్నాలజీ 

ఎంబీఏ: ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్ మెంట్

అర్హత: ఎంటెక్ కోర్సులకు సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్లో. 60 శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణత, ఎంబీఏ కోర్సులకు 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. 

పీజీ డిప్లొమా: మెరైన్ ఇంజనీరింగ్ (కోర్సు వ్యవది ఏడాది) అర్హత: బీఈ/బీటెక్ 50 శాతం మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్/నావల్ అర్కిటెక్చర్ ఉత్తీర్ణత.

ఐఎంయూ సెట్

యూజీ కోర్సుల ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూడ్, పిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 10+2 స్థాయి ప్రశ్నలు వస్తాయి. ఎంబీఏ కోర్సులకు 120 ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఎంటెక్. కోర్సుల ప్రశ్నపత్రం 121 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్, మ్యాథ్స్ తోపాటు మెకానికల్ / నావల్ ఆర్కిటెక్చర్ / మెరైన్ / సివిల్ వీటిలో ఏదో ఒక విభాగం నుంచి అభ్యర్థి జవాబులు రాయాలి. అన్ని పరీక్షలూ అబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. తప్పు సమాదానాలకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.

ఐఏయూ పీహెచ్ డీ, ఎంఎస్ రిసెర్చ్, ఇంటిగ్రేటెడ్ హెచ్ కోర్సులనూ అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి ప్రత్యేకంగా ప్రకటన వెలువడుతుంది. పరీక్ష ఇంటర్వ్యూలతో అవకాశం కల్పిస్తారు.

ప్రవేశం

ఈ సంస్థల్లోని సీట్లకు వివిధ మార్గాల్లో ప్రవేశం పొందవచ్చు. బీబీఏ కోర్సులకు సీయూఈటీ యూజీ/ఇంటర్ మార్కులతో అవకాశం కల్పిస్తారు. పేజీలో కొన్ని కోర్సులకు సీయూఈటీ పీజీ/ గేట్ స్కోరుతో అవకాశం ఉంటుంది. క్యాట్/ సీమ్యాట్/ మ్యాట్ స్కోరుతో ఎంబీఏ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంస్థ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఐఎంయూ సెట్)తోనూ అవకాశం కల్పిస్తారు. కొన్ని కోర్సులకు అకడమిక్ మార్కుల మెరిట్ నూ చేర్చుకుంటారు.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 5

పరీక్ష తేదీ: జూన్ 8 

పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, కరీంనగర్, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.

వెబ్ సైట్: www.imu.edu.in


DOWNLOAD DETAILED INFORMATION & INSTRUCTIONS

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area