Type Here to Get Search Results !

టీఎస్ ఎల్పీసెట్ నోటిఫికేషన్ : LATERAL ENTRY INTO POLYTECHNIC COMMON ENTRANCE TEST (LPCET)

 టీఎస్ ఎల్పీసెట్ నోటిఫికేషన్ : LATERAL ENTRY INTO POLYTECHNIC COMMON ENTRANCE TEST (LPCET) 



హైదరాబాద్లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ (ఎస్బీటీఈటీ)- 'లేటరల్ ఎంట్రీ ఇన్స్టూ పాలిటెక్నిక్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎల్పీసెట్) 2024' నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులకు ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో రెండో ఏడాది ప్రవే శాలు కల్పించేందుకు ఈ పరీక్షను ఉద్దేశించారు. ఇందులో సాధించిన మెరిట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్లు సహా ప్రైవేట్ అన్ ఎయి డెడ్ ఇంజనీరింగ్ కాలేజీల ఆధ్వర్యంలోని సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్స్ ఇస్తారు. ఎల్పీసెట్ ద్వారా డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థల్లో సంబంధిత విభాగాల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. లేదంటే నిర్దేశిత ఇంజ నీరింగ్ విభాగాల్లో బీఈ/బీటెక్ అడ్మిషన్ తీసుకోవచ్చు.

అర్హత: అభ్యర్థులు రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణతతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రెయినింగ్ డీఈటీ) అందించే బ్రిడ్జ్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. ప్రధమ శ్రేణి మార్కులు తప్పనిసరి. 

ఐటీఐ(డ్రాప్ట్మన్-సివిల్) పూర్తిచేసినవారు డిప్లొ మా(సివిల్ ఇంజనీరింగ్) కోర్సుకు, ఐటీఐ(డ్రాఫ్ట్స్ మన్- మెకానిక్, పిట్టర్, మెషినిస్ట్/మెషినిస్ట్ కంపోజిట్, మెషి నిస్ట్ గ్రిండర్, టర్నర్, మోటార్ వెహికిల్ మెకానిక్, మెకానిక్-ఆర్ అండ్ ఏసీ) అభ్యర్థులు డిప్లొమా(మెకా నికల్/ఆటోమొబైల్/మెటలర్జికల్/ప్యాకింగ్ టెక్నాలజీ/ టెక్స్టైల్ టెక్నాలజీ/మైనింగ్) కోర్సులకు, ఐటీఐ (ఎలక్ట్రా నిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రిషియన్) అభ్యర్ధులు డిప్లొమా (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్)కోర్సులకు, ఐటీఐ(ఐసీటీ అండ్ సిస్టమ్ మెయింటెనెన్స్) అభ్యర్ధులు డిప్లొమా (కంప్యూటర్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రా నిర్చ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్) కోర్సులకు అర్హులు, 

ఎల్పీ సెట్ 2024 వివరాలు: పరీక్ష ఆబ్జెక్టివ్ విదా నంలో ఉంటుంది. ఇందులో మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మేథమెటిక్స్ నుంచి 00. పిజిక్స్ నుంచి 30, కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు అడుగు తారు, అభ్యర్ధులు సమాదానాలను ఓఎంఆర్ పత్రం మీద హెచ్ బీ పెన్సిల్ గుర్తించాలి. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 120, పరీక్ష సమయం రెండు గంటలు ఇందులో అర్హత పొందా అంటే కనీసం 50 శాతం మార్కులు రావాలి, పరీక్ష సిలబస్ కోసం వెబ్సైట్ చూడవచ్చు.

దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి దర వాస్తు పారాన్ని డౌన్లోడ్ చేసుకొని నింపి దరఖాస్తు ఫీజు డీడీని జతచేసి మాసబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో సబ్బిట్ చేయాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు రూ.300. 

దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉండే తేదీ: ఏప్రిల్ 16 వరకు

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 20 

ఎల్పీసెట్ 2024 తేది: మే 30-

పరీక్ష కేంద్రం: గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్.

వెబ్ సైట్: sbtet.telangana.gov.in


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area