అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీ హెచ్ డీ అక్కర్లేదు
ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియా మకానికి పీహెచీని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని యూజీసీ వెనక్కి తీసుకుంది. ఈ పోస్టులకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ను కనీస అర్హతగా యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ప్రకటించారు. "అసిస్టెంట్ ప్రొఫెసర్కు పీహెచ్ అవసరం లేదని మేము భావిస్తున్నాం. దాని వల్ల ప్రతిభ ఉన్న వారు విద్యాబోధనకు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే మా నిర్ణ యాన్ని వెనక్కి తీసుకున్నాం" అని ఆయన తెలిపారు. 2018లో విద్యాసం స్థల్లో నియామకాలకు సంబంధించి ప్రమాణాలను నిర్ణయిస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి పీహెచ్డీని యూజీసీ తప్పనిసరి చేసింది. పీహె చీని పూర్తి చేసేందుకు అభ్యర్థులకు మూడేళ్ల సమయాన్ని ఇస్తూ, 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావించింది. అయితే కొవిడ్ మహమ్మారి ప్రభావంతో పీహెచ్ విద్యార్థుల పరిశోధనలు నిలిపోయిన నేపథ్యంలో యూజీసీ ఆ గడువును జూలై 2023 వరకు పొడిగించింది. ఇప్పుడు పీహెచీనే అవసరం లేదని ప్రకటించింది.