ఇండియన్ ఆర్మీలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాలు
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఎన్ సీ సీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 55వ కోర్సు(ఏప్రిల్ 2024)కు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 55
కేటగిరీ వారీగా ఖాళీలు:
ఎన్ సి సి పురుషులు - 50,
ఎన్ సీసీ మహిళలు - 05.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎన్సీసీ-సి సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు: 01.01.2024 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్ లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 టెస్టులు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామి నేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.08.2023.
వెబ్సైట్: https://joinindianarmy.nic.in