Type Here to Get Search Results !

కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సెట్స్) ఫర్ బీటెక్

కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సెట్స్) ఫర్ బీటెక్



» బీటెక్ ప్రవేశాలకు పలు ఎంట్రన్స్ టెస్ట్లు

» బెస్ట్ స్కోర్తో ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశం

» ఒకే ప్రిపరేషన్ తో అన్నింటికీ సంసిద్ధత పొందే అవకాశం

ఇంజనీరింగ్ చదవాలి. బీటెక్ లో అడుగు పెట్టాలి. ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థుల లక్ష్యం! ఇందుకోసం ఇంటర్లో చేరిన తొలి రోజు నుంచే కృషి చేస్తుంటారు. ఎక్కువ మంది బీటెక్ ఎంట్రన్స్ అనగానే జేఈఈ మెయిన్ లేదా ఈఏపీసెట్ గురించే ఆలోచిస్తారు. ఈ టెస్టుల్లో ఆశించిన ఫలితం రాకుంటే నిరాశకు గురవుతున్నారు. అయితే ఇంజనీరింగ్లో చేరేందుకు జేఈఈతోపాటు మరెన్నో ఎంట్రన్స్లు ఉన్నాయి. వాటిల్లో ర్యాంకు ద్వారా ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరొచ్చు. అంతేకాకుండా జేఈఈ, ఈఏపీ సెట్ ప్రిపరేషన్ తోనే ఇతర ఎంట్రన్స్ ల్లోనూ రాణించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఎంపీసీ విద్యార్థులకు ఉపయోగపడేలా.. దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల వివరాలు.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

జేఈఈ-మెయిన్

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ఇంటర్ ఎంపీసీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్ధికి తెలిసిన పరీక్ష జేఈఈ- మెయిన్, జాతీయ స్థాయిలో... ఎన్ఐ్వటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్ ఇన్స్టి ట్యూట్లలో బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్. అదే విధంగా ఐఐటీల్లో ప్రవేశానికి జరిపే జేఈఈ అడ్వాన్స్డ్్కు ప్రామాణికంగా నిలుస్తున్న పరీక్ష, మూడు విభాగాల్లో (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమి (స్త్రీ) అన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.

జేఈఈ మెయిన్ పేపర్-2తో బీఆర్క్

జేఈఈ మెయిన్స్ తో బీటెక్ మాత్రమే కాకుం డా.. ఎన్వటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోని సంస్థల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో సైతం ప్రవేశాలు లభిస్తాయి. అయితే అభ్యర్థులు ఇందుకోసం ప్రత్యేకంగా నిర్వహించే జేఈఈ-మె యిన్ పేపర్-2లో ర్యాంకు పొందాల్సి ఉంటుంది. ఈ పేపర్ స్కోర్ ఆధారంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, సీఎఫ్టీఐల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ పేపర్ లో మ్యాథ మెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ విభా గాల్లో నైపుణ్యాలను పరీక్షిస్తారు. మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్లను ఆన్లైన్ విధానంలో, డ్రాయిం గ్ టెస్ట్ను పెన్ పేపర్ విధానంలో నిర్వహిస్తారు..

* అదే విధంగా.. పేపర్-2బి పేరుతో బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మరో పేప ర్లో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్లానింగ్ బేస్డ్ ప్రశ్నలు అడుగు తారు. ఇందులో మెరుగైన స్కోర్ ఆధారంగా బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సులో అడుగు పెట్టొచ్చు.

వెబ్ సైట్: https://jeemain.nta.nic.in

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ఐఐటీలకు జేఈఈ అడ్వాన్స్డ్

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ఇంజనీరింగ్ విద్యా బోధనలో అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకున్న ఇండియన్ ఇన్స్టిట్యూ ట్స్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్(ఐఐటీ)ల్లో.. బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్ + ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష, జేఈఈ- మెయిన్ పేపర్-1లో ప్రతిభ ఆధారంగా 2.5 లక్షల మందిని జేఈఈ-ఆ డ్వాన్స్డ్కు అర్హత కల్పిస్తారు. ఈ పరీక్ష రెండు పేప ర్లలో ఉంటుంది. ఒక్కో పేపర్ పరీక్ష సమయం మూడు గంటలు, ప్రతి పేపర్లోనూ మ్యాథమెటి క్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు.. పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఈ పరీక్ష జరుగు తుంది. ఇందులో స్కోర్ ఆధారంగా ఐఐటీలే కాకుం డా.. ఐఐఎస్ టీ, ఐఐఎస్సీ తదితర ప్రముఖ ఇన్స్టి ట్యూట్లలో కూడా ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ--అడ్వాన్స్డ్ - 2026 ను మే 17న నిర్వహించనున్నారు. 

వెబ్ సైట్: www.jeeadv.ac.in

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ఈఏపీ సెట్

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

• రాష్ట్ర స్థాయిలోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్స్, కాలేజ్ లలో ఇంజనీరింగ్ చదవాలనుకునే వారికి అం దుబాటులో ఉన్న మార్గం.. ఈఏపీసెట్. రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల నేతృ త్వంలో.. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన యూని వర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఈఏపీ సెట్ నిర్వహిస్తున్నారు.

• బీటెక్ కోర్సుల అభ్యర్థులు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పేపర్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇంజ నీరింగ్ స్ట్రీమ్ ఉత్తీర్ణత ద్వారా బీటెక్ తోపాటు బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) /బీటెక్(డెయిరీ టెక్నాలజీ)/బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)/బీటెక్ ( బయో టెకాలజీ)/బీఫార్మసీ (ఎంపీసీ)/ఫార్మ్-డీ(ఎంపీసీ) కోర్సుల్లోనూ చేరొచ్చు.

• రెండు స్క్రీమ్లకు సంబంధించి 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ మ్యాథమెటిక్స్లోలో 80 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ లలో 40 ప్రశ్నలు చొప్పున అడుగుతారు.

• అగ్రికల్చర్, ఫార్మసీ, మెడిసిన్ విభాగాల్లో బయా లజీ(బోటనీ, జువాలజీ) నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 40 ప్రశ్నలు చొప్పున ఉంటాయి.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

బిట్ శాట్

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

• జాతీయ స్థాయిలో జేఈఈ తర్వాత అంతటి ప్రాముఖ్య కలిగిన మరో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్.. బిట్ శాట్) ఇంజనీరింగ్ విద్యలో పేరు గడించిన ది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్-పిలానీ).. బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుం ది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా బిట్స్ పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్లలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.

• ఇంటర్మీడియెట్ 75 శాతం మార్కులతో ఉత్తీ ర్ణత సాధించాలనే నిబంధన ఉంది.

• ఈ పరీక్షను కూడా పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే ఆన్లైన్ టెస్ట్గా నిర్వహిస్తారు.

• మొత్తం నాలుగు విభాగాల్లో ప్రశ్నలు అడుగు తారు. అవి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ ప్రొఫిష్ యన్సీ, లాజికల్ రీజనింగ్: మ్యాథమెటిక్స్ (ఇం జనీరింగ్ అభ్యర్థులకు); బయాలజీ (బీఫార్మసీ అభ్యర్థులకు). మొత్తం 130 ప్రశ్నలతో పరీక్ష ఉం టుంది. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటా యిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు,

• బిట్ శాట్ 2026 కు సంబంధించి తాజాగా నోటి ఫికేషన్ విడుదలైంది. రెండు దశల్లో పరీక్ష నిర్వ హించనున్నారు. అభ్యర్థులు మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

• తొలిదశ పరీక్షను ఏప్రిల్ 15 నుంచి 17 వరకు రెండో దశ పరీక్షను మే 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు.

వెబ్ సైట్: www.bitsadmission.com

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్ట్చర్

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

• ఎంపీసీ అర్హతతో ప్రవేశం పొందే అవకాశం ఉన్న మరో కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇం దులో ప్రవేశానికి నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ అర్కిటెక్చర్ పేరుతో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీ క్షలో స్కోర్ ఆధారంగా కొన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గుర్తింపు పొందిన కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కి టెక్చర్(బీఆర్క్) కోర్సులో అడుగు పెట్టొచ్చు. ఇం టర్మీడియెట్లో ఎంపీసీ గ్రూప్ 50 శాతం మా ర్కులతో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉంది.

• ఆన్లైన్ విధానంలో నిర్వహించే నాటాలో 125 ప్రశ్నలు (200 మార్కులు) ఉంటాయి. డయగ్ర మాటిక్ రీజనింగ్, న్యూమరికల్ రీజనింగ్, వెర్ష ల్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్, సిట్యుయేషనల్ జడ్జ్మెంట్, లాజికల్ రీజనింగ్, అబ్జెక్ట్ రీజ నింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

• మార్చి నెలలో నాటా ఆప్లికేషన్ ప్రక్రియ మొదల వనుంది.

వెబ్ సైట్: https://www.nata.in

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

నెస్ట్

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థులు సైన్స్ అనుబంధ విభాగాల్లోనే ఉన్నత విద్యను చదవాల నుకుంటే వారికి ఉన్న మరో ప్రత్యామ్నాయం.. నేష నల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ టెస్ట్లో స్కోర్ ఆధారంగా.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యు కేషన్ అండ్ రీసెర్చ్(నైనర్)- భువనేశ్వర్, యూనివ ర్సిటీ ఆఫ్ ముంబై-డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్సీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ లలో అయిదేళ్ల ఇంటి గ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం పాండొచ్చు. మొ త్తం నాలుగు సబ్జెక్ట్లో(బయలాజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్) ఇంటిగ్రే టెడ్ పీజీ కోర్సులు అందుబాటులో ఉంటాయి. నెస్ట్ ఎంట్రన్స్.. నాలుగు విభాగాల్లో (మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ) 200 మార్కులకు ఆన్లైన్ విధానంలో జరుగుతుంది.

వెబ్ సైట్ : https://www.nestexam.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area