Type Here to Get Search Results !
🔥 Latest Jobs

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అసిస్టెం రైట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అసిస్టెం రైట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అసిస్టెం రైట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 8.

ఖాళీలు: 650. (అసిస్టెంట్)

ఎలిజిబిలిటీ:

• గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది.

• కంప్యూటర్ లో వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం ఉండాలి.

• రాష్ట్ర/ రిక్రూటింగ్ కార్యాలయ స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

• మాజీ సైనికులకు కనీసం 15 సంవత్సరాల రక్షణ సేవ లేదా మాజీ సైనికులుగా గుర్తింపు పొంది ఉండాలి.

వయోపరిమితి: 20 నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా,

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 16.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్య ర్థులకు రూ.450, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు రూ.50. ఆర్బీఐ స్టాఫ్కు ఫీజు మినహా యింపు ఉంటుంది.

లాస్ట్ డేట్: మార్చి 8

సెలెక్షన్ ప్రాసెస్:

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.60 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.

మెయిన్ ఎగ్జామినేషన్: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు. 135 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్పీటీ): ఇది కనీస అర్హత పరీక్ష మాత్రమే. రాష్ట్ర స్థానిక భాషలో ప్రావీ ణ్యాన్ని పరీక్షించడానికి నిర్వహిస్తారు. తుది ఎంపిక మెయిన్ ఎగ్జామినేషన్ లో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది.

వెబ్సైట్: www.rbi.org.in 

⏳ Application Last Date Countdown
Loading...

Age Eligibility Calculator







Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area