సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ - 2026
యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది.
» అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్ రాతపరీక్ష), మెయిన్స్ పరీక్ష (రాతపరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్) ఆధారంగా ఎం పికచేస్తారు.
» ప్రిలిమినరీ పరీక్ష: ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉం టాయి. నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు.
» మెయిన్స్ పరీక్ష: డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్, హన్మకొండ.
» మెయిన్స్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 04.02.2026.
» దరఖాస్తులకు చివరి తేదీ: 24.02.2026.
» ప్రిలిమినరీ పరీక్ష తేది: 24.05.2026.
» వెబ్ సైట్: https://upsconline.nic.in/
.jpeg)