Type Here to Get Search Results !

కెరియర్ ఉన్నతికి అభ్యాసమే ఆయుధం!

కెరియర్ ఉన్నతికి అభ్యాసమే ఆయుధం!



కార్పొరేట్ కొలువులు దక్కాలని ఎక్కువ మంది యువత కలలు కంటారు. ఉద్యోగంలో చేరిన వెంటనే పదోన్నతులూ, అధిక ప్యాకేజీలపై దృష్టి సారిస్తారు. ఈ రెండూ సొంతం కావాలంటే కొన్ని విషయాలపైన దృష్టి సారించాలి. కార్పొరేట్ కెరియర్లో తొలుత కొన్నేళ్లూ నేర్పుకునే దశ. ఈ వ్యవధిలో ఉద్యోగి దృక్పథం సంస్థలో ఎదుగుదలని నిర్ణయిస్తుంది. విద్యార్థి దశలోనే ఈ విషయాలపై అవగాహన పెంచుకుంటే కార్పొరేట్ కెరియర్లో రాణించడం సులువవుతుంది.

ప్రకాష్, అనిల్ ఇద్దరూ ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చదువుకున్నారు. ఒక అంకుర సంస్థలో ట్రెయినీలుగా చేరారు. వీరిలో అనిల్ విలాసవంతమైన జీవితం కావాలని కోరుకునేవాడు, అంకుర సంస్థలో వచ్చే జీతంతో ఆశించిన స్థాయి జీవితాన్ని అనుభవించలేనని భావించాడు. ఏ పని కేటాయించినా 'తీసుకునే జీతానికి ఈ పనే' ఎక్కువ అనుకునేవాడు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూసలేదు. అధిక ప్యాకేజీ ఆఫర్ చేసిన మరో సంస్థకు మారాడు.


ప్రకాష్ మాత్రం ఆంకుర సంస్థలో నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావించాడు. సీనియర్స్ నుంచి అదనపు పనిని స్వచ్చందంగా తీసుకున్నాడు. నేర్చుకోవడమే ధ్యేయంగా నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నాడు. ఆ అంకుర సంస్థలోనే కొనసాగాడు ఐదేళ్లు తిరిగే సరికల్లా బంకురం ప్రపంచ స్థాయి సంస్థగా రూపొందింది. ప్రకాష్ సీఈవోగా అత్యున్నత పదవిని చేపట్టాడు. తగిన నైపుణ్యాలు పెంచుకోకపోవడంతో ప్రతి సంస్థలోనూ అనిల్ విఫలమయ్యాను. చివరికి ట్రెయినీగా మొదలు పెట్టిన అంకుర సంస్థలోనే మేనేజరుగా చేరాడు. ఒకే దగ్గర చదువు పూర్తిచేసుకుని, ఒకే సంస్థలో చేరిన ఇద్దరిలో ఒకరు సీఈవోగా మారితే, మరొకను మేనేజర్ స్థాయికి పరిమితమయ్యారు. కార్పొరేట్ సంస్థల్లో కెరియర్ ఒక సుదీర్ఘ ప్రయాణం. ఇందులో రెండు దశలు ముఖ్యమైనవి, మొదటిది అధ్యాస దశ, రెండోది. ఆర్జన దశ. అభ్యాసాన్ని నిర్లక్ష్యం చేస్తే రెండోది దడ్కడు. అందువల్ల కెరియర్ ప్రారంభంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.

అభ్యాస దశ

కాలేజీలు డిగ్రీలు సాదించేలా. చేస్తాయి. కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగంతో పాటు వికాసాన్ని కలిగిస్తాయి. ఉద్యోగంలో చేరిన తొలి రెండు మూడేళ్లూ నేర్చుకునే డ. ఇది మీరు మరింత ఉన్నతంగా రూపొందడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. ఈ దశలో పని భారం ఎక్కువ, ప్రశయలు తక్కువగా ఉంటాయి. ఈ కాలంలో ఎదురయ్యే విమర్శలు, ఉద్యోగిగా మీరు దృఢపడటానికి ఉపయోగపడతాయి.

ఉద్యోగంలో చేరిన మొదటి ఏడాదిని విద్యార్థి జీవితానికి కొనసాగింపుగా భావించండి. అధ్యయనాన్ని ఆపకండి కాలేజీలు విజ్ఞానాన్ని అందిస్తాయి. వ్యాపార సంస్థలు ఆచరణాత్మకంగా ఎలా పని చేయవచ్చో తెలిసేలా వేస్తాయి. మనోవైఖరి, నేర్చుకునే సామర్థ్యం, వేగం, సమస్యలను ఎదుర్కొనే సమర్ధత, బాధ్యతలను స్వీకరించే స్వభావం యువ ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాలేజీ పుస్తకాల సిలబస్లో ఈ విషయాలేవీ ఉండవు. అలాగే వ్యాపార సంస్థల శిక్షణలోనూ నేర్పరు.

ఆర్జన దశ

ఉద్యోగంలో అనుభవం సంపాదించి, చేస్తున్న పనిపై పూర్తి నియంత్రణ వచ్చినపుడు సమస్యలను స్వయంగా పరిష్కరించగలిగే సామర్థ్యం సొంతమవుతుంది. సంస్థ లక్ష్య సాధనకు విలువ చేకూర్చగలరన్న నమ్మకం యాజమాన్యానికి కలిగితే మీరు ఆర్జన దశలోకి ఆడుగు పెట్టేందుకు అర్హత సాదించినట్లే. ఈ దశలో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కార్పొరేట్ ఉద్యోగంలో మొదటి దశ.. ప్రతిభను నిరూపించుకోవడానికి, ఆలోచనా విధానాన్ని నిర్మించుకునేందుకూ సన సమయం. ఇక్కడ ఎదురయ్యే విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకుండా పాఠాలుగా మార్చుకోండి. ప్రతి పనిలోనూ నేర్చుకునే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. సానుకూల దృక్పథం అలవర్చుకోండి.

నేర్చుకోవడమే ధ్యేయం

బావన సాధారణ డిగ్రీ పూర్తిచేసుకుని, ఒక బహుళ జాతి సంస్థలో ట్రెయినీగా చేరింది. రోజువారీ సమావేశాల్లో పరిశీలించిన అంశాలు శ్రధ్ధగా రాసుకునేది వాటిని సమీక్షించుకుని నైపుణ్యాలు, పని పద్ధతులను సరిచేసుకునేది. బృందంలోనూ, సంస్థలోనూ ఆమెను ఎవరూ గుర్తించేవారు కాదు. అయితే ఒక ప్రాజెక్ట్ అమలులో తలెత్తిన కఠిన సమస్యను ఆమె సులభంగా పరిష్కరించి, అందరి దృష్టినీ ఆకర్షించింది. సమస్యను ఆమె పరిష్కరించిన విధానాన్ని యాజమాన్యం మెచ్చుకుంది. ఆమె నైపుణ్యాన్ని గుర్తించి, ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీతో పాటు పదోన్నతీ కల్పించింది.

సాధారణ గ్రాడ్యుయేట్ అయిన భావన ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదిగింది. శిక్షణ కాలంలో పూర్తి సమయాన్నీ, వనరులనూ నైపుణ్యాభివృద్ధికి వినియోగించుకోవాలి. ప్రతి అంశాన్ని శ్రద్ధగా నేర్చుకునే ఉద్యోగులకు ఉన్నత స్థాయి పదవులూ, సౌకర్యాలూ సహజంగా వస్తాయి. ఉద్యోగుల ఆలోచనా విధానాన్నీ, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్నీ, మనోవైఖరినీ సంస్థలు. పరిశీలిస్తాయి.

అత్యంత తెలివైన ఉద్యోగులతో పోలిస్తే, అత్యంత సూక్ష్యంగా నేర్చుకునే వైఖరీ ఉన్నవారే కార్పొరేట్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతారు. అందుకే కెరియర్ ఉన్నతికి ఎంతో ముఖ్యమైన అభ్యాసాన్ని నిరంతరం కొనసాగించాలి.

- దొరైరాజ్ 

సీనియర్ జనరల్ మేనేజర్, 

ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area