నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) లిమిటెడ్ 48 మేనేజర్ పోస్టుల భర్తీ
నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) లిమిటెడ్ 48 మేనేజర్ పోస్టులను భర్తీచేయనుంది. ఇంజినీరింగ్ డిగ్రీ, ఉద్యోగానుభవంతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి.
ఎంపిక:
▪️విద్యార్హతలు, అనుభవాలతో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి సీబీటీకి అవకాశమిస్తారు. పరీక్షకు 85 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
▪️సీబీటీ, పర్సనల్ ఇంటర్వ్యూల్లో జనరల్ అభ్యర్థులు 50 శాతం చొప్పున, ఎస్సీ/ ఎస్టీ/ఓబీసీ-ఎన్సీఎల్ లు 40 శాతం, దివ్యాంగులు 30 శాతం చొప్పున కనీసార్హత మార్కులు సాధించాలి. వీరిని 1:10 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
▪️ఇంటర్వ్యూలోనూ విజయవంతమైనవారిని వైద్య పరీక్షల అనంతరం కేటగిరీల వారీగా తుది నియామకాలు చేపడతారు.
▪️రాతపరీక్ష/ సీబీటీకి హాజరయ్యే ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు, పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులందరికీ రెండో తరగతి రైలు ఛార్జీలను చెల్లిస్తారు.
వివరాలు
అర్హత: సివిల్/ మెకానికల్/ఎలక్ట్రికల్/ కెమికల్ బ్రాంచ్ ఇంజినీరింగ్ డిగ్రీ. సంబంధిత రంగంలో ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: దరఖాస్తు గడువు తేదీ నాటికి 38 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ ఎన్సీఎలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరలు 5.1000. 2 2/దివ్యాంగులకు రూ.500.
వేతన శ్రేణి: నెలకు రూ.80,000 - రూ. 2,20,000. మూలవేతనానికి అదనంగా డీఏ, హెచ్ఎస్ఏ, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడికల్, పీఎఫ్, గ్రూప్ ఇన్స్యూరెన్స్, గ్రాట్యుటీ సదుపాయాలు ఉంటాయి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.02.2026
వెబ్ సైట్: https://nalcoindia.com/
.jpeg)