నీట్ యూజీ- 2026 - నీట్లో నెగ్గే వ్యూహం
» నీట్-యూజీ 2026 సిలబస్ విడుదల.
» మే 3వ తేదీన పరీక్ష నిర్వహణకు అవకాశం
» వ్యూహాత్మక ప్రిపరేషన్ తోనే విజయం
నీట్ యూజీ.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్! ఇది దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్, ఆయుష్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయు ర్వేద, హోమియోపతి తదితర మెడిసిన్ అను బంధ బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వ హించే పరీక్ష, ఇందులో ర్యాంకు సాధించేం దుకు బైపీసీ విద్యార్థులు నిరంతరం శ్రమిస్తుం టారు. నీట్లో బెస్ట్ స్కోర్ తో తమ మెడికల్ కల సాకారం చేసుకోవాలని కృషి చేస్తుం టారు. ఈ విద్యార్థులంతా తమ ప్రిపరేషను ముమ్మరం చేసుకోవాల్సిన సమయం వచ్చే సింది. ఎందుకంటే.. నీట్ యూజీ-2026 సిలబస్ ను నిర్వాహక సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్డీఏ) తాజాగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. నీట్ యూజీ సిలబస్ వివ రాలు, ప్రిపరేషన్ విధానంపై ప్రత్యేక విశ్లేషణ...
పెరుగుతున్న పోటీ
నీట్-యూజీకి పోటీ పెరుగుతోంది. దేశంలోని అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశానికి నీట్-యూజీ స్కోర్నె ప్రామాణికంగా పరిగణిస్తుండటం తో ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సం ఖ్య అధికంగా ఉంటోంది. ఆల్ ఇండియా కోటా పేరిట దేశంలోని అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో 15 శాతం సీట్లను; రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూని వర్సిటీల పరిధిలోని సీట్లను; డీమ్డ్ యూనివర్సి టీలు, ప్రైవేట్ వర్సిటీలు ఇలా అన్ని కేటగిరీల యూనివర్సీటీలు, ఇన్స్టిట్యూట్స్లో ఎంబీబీఎస్, బీడీఎస్లో ప్రవేశాలను నీట్ స్కోర్ ఆధారంగానే నిర్వహిస్తారు. అదే విధంగా ఆయుష్ కోర్సులుగా పిలిచే బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, బీయూఎం ఎస్, బీఎన్ వైఎస్ తదితర కోర్సులకు కూడా నీట్ స్కార్ని ప్రామాణికంగా తీసుకుంటారు.
నీట్ యూజీ స్వరూపం
నీట్-యూజీ పరీక్షను మొత్తం నాలుగు సబ్జెక్ట్ లలో 720 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఫిజిక్స్ 45 ప్రశ్నలు-180 మార్కులకు, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు-180 మార్కులకు, బోటనీ 45 ప్రశ్నలు -180 మార్కులకు, జువాలజీ 45 ప్రశ్నలు-180 మార్కులకు ఉంటాయి.
గతేడాది మాదిరిగానే
తాజాగా విడుదల చేసిన నీట్ సిలబస్ను పరిగ ణనలోకి తీసుకుంటే.. గత ఏడాది మాదిరిగానే ఉం దాని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. పరీక్ష విధానం లోనూ మార్పులు ఉండకపోవచ్చని చెబుతున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పార్ట్-బిలో ఛాయిస్ ఉండదనే అభిప్రాయం వ్యక్త మవుతోంది.
సబ్జెక్ట్ వారీగా ముఖ్యమైన టాపిక్స్
నీట్ సిలబస్ ఖరారైన నేపథ్యంలో సబ్జెక్ట్ వారీగా సన్నద్ధతకు, ఆయా సబ్జెక్ట్లో దృష్టి పెట్టాల్సిన అంశాలు.
ప్రాక్టీస్తో ఫిజిక్స్ లో మంచి మార్కులు
పరీక్షలో మొదటి విభాగంగా ఉండే ఫిజిక్స్లో విద్యార్థులు ప్రాక్టీస్కు ప్రాధాన్యమివ్వాలి. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్ట ర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ప్రతి చాప్టర్కు చివర ఇచ్చిన ప్రశ్నలను తప్పనిస రిగా ప్రాక్టీస్ చేయాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటే షనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్పై ఎక్కువగా దృ ష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇం డక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవ డంతో పాటు పదే పదే ప్రాక్టీస్ చేయాలి.
కెమిస్ట్రీ.. కాన్సెప్ట్, రివిజన్
ఈ సబ్జెక్ట్ లో ఆయా విభాగాలకు సంబంధించి కాన్సెప్ట్పై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి, అదే విధంగా రివిజన్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి, ముఖ్యంగా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్. కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డి నేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమి స్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల సమ్మేళనాల తయారీకి కొంత వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. కెమిస్ట్రీలో విద్యా ర్థులు చర్యలు. సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి నిరంతరం పునఃశ్చరణ చేయాలి.
ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమి స్త్రీలో ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. 'ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. పీరియాడిక్ టేబుల్పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి స్కోర్కు ఆస్కారం ఉంటుంది.
బోటనీకి ఇలా...
నీట్లో కీలకంగా భావించే బోటనీపై విద్యా ర్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఫిజియాలజీ ఆఫ్ స్లాం టీ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ ఆం డ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్లను ముఖ్య చాప్టర్లుగా భావించి చద వాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్టపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్పై ప్రశ్నలు వస్తున్నాయి. వీ టితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై ఫోకస్ చేయడం లాభిస్తుం ది. ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవ లప్మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేర వ్వాలి. సెల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్లోలో కణ విభజన (సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటన్స్లో రెప్లికే షన్, ట్రాన్స్డస్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్లపై దృష్టిపెట్టాలి.
జువాలజి
జువాలజీలో రాణించేందుకు హ్యూమన్ ఫిజి యాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్ టాపి క్స్ పై విద్యార్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆ రటీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు: అడుగుతున్నారు. కాబట్టి గత ప్రశ్న పత్రాలను, ఇం టర్లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఈఆర్టీ, ఇంటర్ పుస్తకా లను క్షుణ్నంగా చదివితే ఉపయుక్తంగా ఉంటుంది.
ప్రతి సబ్జెక్ట్లలో 130 మార్కులు
నీట్ లో మెరుగైన స్కోర్ ద్వారా మెడికల్ సీటు సొంతం చేసుకునేందుకు ప్రతి సబ్జెక్ట్ నూ 180 మార్కులకు గాను కనీసం 130 మార్కులు సాధిం చేలా సిలబస్ అంశాలను ఔపోసన పట్టాలని నిపు ణులు సూచిస్తున్నారు. మొత్తంగా 720 మార్కులకు గాను 450 మార్కుల నుంచి 500 మార్కులు సాధించేలా కృషి చేస్తే.. మెడికల్ కోర్సుల కల నెర వేరుతుంది.
బోర్డ్ పరీక్షలతో సమన్వయం
• నీట్-యూజీకి సన్నద్ధమయ్యే విద్యార్థులు బోర్డ్ పరీక్షలతో ప్రిపరేషన్ ను సమన్వయం చేసుకో వాలి. బోర్డ్ పరీక్షలకు నెల రోజుల ముందు వరకు ఇంటర్, నీట్ సిలబస్లను అనుసం ధానం చేసుకుంటూ చదవాలి. బోర్డ్ పరీక్షలు పూర్తయిన తర్వాత.. నీట్ సిలబస్ కు అనుగుణం గా వెయిటేజీని అనుసరిస్తూ సమయం కేటా. యించుకోవాలి. పరీక్షలో ఎక్కువ వెయిటేజీ ఉన్న అంశాలను ఎక్కువ సేపు చదవాలి. ఈ విషయంలో అభ్యర్థులు స్వీయ సామర్ధ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి.
• రివిజన్ కు ఎక్కువ సమయం కేటాయించాలి. ప్ర తి రోజు చదవాల్సిన టాపిక్స్లు ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయ నం చేయాలి. మాక్ టెస్టులకు హాజరవ్వాలి. మో డల్ కొశ్చన్స్ల్స్ను ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్ డైరెక్ట్ కొశ్చన్స్ ్న ఎక్కువగా అడుగు తున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణం గా మోడల్ టెస్ట్లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. దీనిద్వారా రివి జన్ సమయంలో సమయం ఆదా అవుతుంది.
.jpeg)