Type Here to Get Search Results !

కేంద్రంలో ఇంజనీరింగ్ కొలువు - రాత పరీక్షకు ప్రిపరేషన్, తదితర వివరాలు.

 కేంద్రంలో ఇంజనీరింగ్ కొలువు - రాత పరీక్షకు ప్రిపరేషన్, తదితర వివరాలు.



ఇంజనీరింగ్ ఉత్తీర్ణులకు అద్భుత అవకాశం స్వాగతం పలుకుతోంది! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ). ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(ఈఎస్ఈ) -2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్ తోనే ఉన్నత స్థాయి సర్కారీ కొలువులో కుదురుకునేం దకు ఇది చక్కటి మార్గం. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-ఎ. గ్రూప్-బి స్థాయి గెజిటెడ్ హోదాలో ఇంజనీర్లుగా ఆకర్షణీయ వేతనాలు అందుకో వచ్చు!! ఈ నేపథ్యంలో.. ఈఎస్ఈ -2026 నోటిఫికేషన్, కేంద్రంలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, రాత పరీక్షకు ప్రిపరేషన్ తదితర వివరాలు...

» యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026 నోటిఫికేషన్

» వివిధ విభాగాల్లో 474 ఉన్నత స్థాయి పోస్టులకు ఎంపిక ప్రక్రియ

» ఇంజనీరింగ్ డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడు దల చేసింది. అర్హతలున్న అభ్యర్థులు ఆన్లైన్ విధా సంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 474

విభాగాలు:

సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిక మ్యూనికేషన్ ఇంజనీరింగ్.

అర్హత:

పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూని వర్శిటీ నుంచి బీఈ/బీటెక్ చదివి ఉండాలి. లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్(ఇండియా) ఎగ్జామి నేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/సెక్షన్లు. ఎ, బి అర్హత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూషన్(ఇండి యా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా ఎంఎస్సీ(వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్, రేడియో ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు:

01.01.2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలిం పు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ:

ఈఎస్ఈ నియామక ప్రక్రియటో మూడు దశలు ఉంటాయి. మొదటి రెండు దశలు రాత పరీక్షలు. కాగా, మూడో దశను పర్సనల్ ఇంటర్వ్యూగా పేర్కొన్నారు. అవి.. స్టేజ్-1(ప్రిలిమినరీ ఎగ్జామినే షన్), స్టేజ్-2 (మెయిన్ ఎగ్జామినేషన్), స్టేజ్-3. (పర్సనాలిటీ టెస్ట్).

ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారిని రెండో దశ స్టేజ్-2 మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయి న్స్లోలో ప్రతిభ ఆధారంగా పర్సనాలిటీ టెస్ట్ (ఇంట ర్వ్యూ)కు పిలుస్తారు.

తుది ఎంపికలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా మూడు దశల్లో సాధించిన స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటారు.

తొలిదశ ప్రిలిమినరీ

ఎంపిక ప్రక్రియలో స్టేజ్-1గా పేర్కొనే ప్రిలిమి నరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అవి..-పేప 5-1(జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూ డ్) -పేపర్-2(ఇంజనీరింగ్ సంబంధిత సబ్జెక్ట్). పేపర్-1ను 200 మార్కులు, పేపర్-2ను 300 మార్కులకు నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేష న్లోని పేపర్-1 అన్ని విభాగాల అభ్యర్థులకు ఒకే మాదిరిగా ఉంటుంది. పేపర్-2 మాత్రం అభ్యర్థి దరఖాస్తు సమయంలో పేర్కొన్న సబ్జెక్ట్పై జరుగు తుంది. ప్రిలిమినరీ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు తగ్గిస్తారు.

డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్

ఈఎస్ఈ ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయి న్/స్టేజ్-2 ఎగ్జామినేషన్ పూర్తిగా డిస్క్రిప్టివ్ విధా నంలో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్కు ఏడుగురు లేదా ఎనిమిది మందిని చొప్పున మెయిన్కు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహి స్తారు. ఒక్కో పేపరు 300 మార్కులు చొప్పున మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. అభ్య ర్థులు ఎంపిక చేసుకున్న ఇంజనీరింగ్ విభాగంపై ఈ పరీక్ష జరుగుతుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్లోనే ఉంటుంది. అభ్యర్థి పెన్-పేపర్ విధానంలో ఇంగ్లి ష్ లోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

200 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్

ఈఎస్ఈ ఎంపిక ప్రక్రియలో చివరి, మూడో దశ.. పర్సనాలిటీ టెస్ట్గా పిలిచే ఇంటర్వ్యూను 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్లో కనీస అర్హత మార్కులు సాధించిన వారిని పర్సనా లిటీ టెస్ట్కు ఎంపిక చేస్తారు. ఒక్కో పోస్టుకు ఇద్దరిని చొప్పున (1:2 నిష్పత్తి) ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులో అభ్యర్థి నాయకత్వ లక్షణాలు, చొరవ, సా మాజిక నైపుణ్యాలు, మానసిక, శారీరక చురుకుద నం. ఆయా అంశాలపై ఉన్న ఆసక్తిని పరిశీలిస్తారు.

ఎంపిక ప్రక్రియలో సక్సెస్

స్టేజ్ 1 (ప్రిలిమ్స్) రాణించేలా

తొలి దశ ప్రిలిమ్స్ పేపర్-1(జనరల్ స్టడీస్ ఆం డ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్)లో మొత్తం పది అం శాల నుంచి ఈ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో మొదటి టాపిక్ గా పేర్కొన్న జాతీయ, అంతర్జా తీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అం శాలు, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిని మినహా యిస్తే మిగతా తొమ్మిది టాపిక్స్ కూడా ఇంజనీరిం గ్ విద్యార్థులు తమ ఆకడమిక్స్లో చదివినవే.

ప్రిలిమ్స్ పేపర్-2లో అభ్యర్థి ఎంచుకున్న ఇంజ నీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రశ్నలతో ఉం టుంది. అకడమిక్ గా సంబంధిత సబ్జెక్ట్ పట్టున్న అభ్యర్ధులు ఈ పేపర్లో రాణించే అవకాశం ఉం టుంది.

సబ్జెక్టుపై పట్టుతో మెయిన్ స్కోర్

స్టేజ్-1 ప్రిలిమినరీ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా.. ఒక్కో పోస్ట్కు ఆరు నుంచి ఏడుగురు అభ్యర్ధులను (1.6 లేదా 1:17 నిష్పత్తిలో) మెయి నకు ఎంపిక చేస్తారు. మెయిన్లో ఆయా ఇంజనీ రింగ్ విభాగానికి సంబంధించిన టాపిక్స్లో పట్టు సాధించడం ద్వారా మంచి స్కోర్ సాధించే అవ కాశం ఉంది. ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరిం గ్లో రోబోటిక్ క్స్కు సంబంధించి తాజా వాస్తవ పరి స్థితులను అన్వయించుకుంటూ అధ్యయనం చేయాలి. అలాగే టెలికమ్యూనికేషన్స్కు సంబంధించి 5జీ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఆదేవిధంగా తాజా టెక్నాలజీలైన ఏఐ, ఎంఎల్ వంటి వాటిపైనా అవగాహన అవసరం.

అనుసంధాన దృక్పథం

అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో.. అనుసం ధాన దృక్పథాన్ని అనుసరించాలి. ప్రిలిమ్స్ లోని పేపర్-2, మెయిన్ ఎగ్జామినేషన్లోని రెండు సబ్జెక్ట్ పేపర్లు అభ్యర్థులు చదివిన ఇంజనీరింగ్ సబ్జెక్ట్లకు సంబంధించినవే. వీటిని అనుసంధానం చేసుకుం. టూ చదివే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ప్రిలిమ్స్ లో గట్టెక్కే విధంగా దృష్టి పెట్టాలి. అందు కోసం కాన్సెప్టు, బేసిక్ను బాగా అధ్యయన చేయాలి. ప్రిలిమ్స్ లో నెగెటివ్ మార్కుల నిబంధన ఉంది. కాబట్టి స్టేజ్1లో అర్హత పొందేందుకు ఆప్ర మత్తత చాలా అవసరం.

అప్లికేషన్ అప్రోచ్

ఇంజనీరింగ్ సర్వీసెస్లో విజయానికి ఆయా సబ్జెక్ట్లోని కాన్సెప్ట్్స్ప పూర్తి అవగాహన పొంద డమే కాకుండా.. వాటిని అన్వయ దృక్పథంతో అధ్యయనం చేయడం లాభిస్తుంది. దీనివల్ల పరీ క్షల్లో ప్రశ్నలు ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సం సిద్ధత లభిస్తుంది. ప్రీవియస్ పేపర్లను సాధన చేయడం, మాక్ టెస్ట్లకు హాజరవడం మేలు చేస్తుంది. మెయిన్స్ కోణంలో ఆకడమిక్ గా తమకు పట్టున్న టాపిక్స్పై మరింత అవగాహన పెంచు కుంటే ఉపయుక్తంగా ఉంటుంది.

ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 26.09.2025.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.10.2025.

ప్రిలిమినరీ/స్టేజ్-1 పరీక్షతేది: 08.02.2026.

వెబ్ సైట్: https://upsconline.nic.in/,

https://www.upsc.gov.in



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area