సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ - 2025
సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే సీఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) డిసెంబర్ 2025 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్ఎఫ్పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పీహెచ్ డీ ప్రవేశాల కోసం "సీఎస్ ఐఆర్ యూజీసీ నెట్' నిర్వహిస్తారు. దీనితోపాటు జేఆర్ ఎఫ్కు అర్హత పొందితే సీఎస్ ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, వివిధ విశ్వవిద్యా లయాల్లో పీహెచ్డీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ యూనివర్సిటీల్లో లేదా డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గానూ ఎంపిక కావచ్చు.
పరీక్ష: జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2025
మొత్తం పరీక్ష పేపర్లు:
• కెమికల్ సైన్సెస్
• ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్
• లైఫ్ సైన్సెస్
• మేథమెటికల్ సైన్సెస్
• ఫిజికల్ సైన్సెస్
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జండర్, దివ్యాంగ, ఓబీసీ అభ్యర్థులకు 50 శాతం చాలు.
వయస్సు: జేఆర్ఎఫ్కు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 2025 డిసెంబర్ నాటికి 30 సంవత్సరాలు మించి ఉండరాదు. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్య ర్థులకు ఐదేళ్లు, నాన్ క్రిమిలేయర్ ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్ఎ ప్రవేశాలకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి మూడు గంటలు. మొత్తం 200 మార్కులకు పరీక్ష సీబీ టీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో జరుగుతుంది. మల్టీపుల్ చాయిస్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి.
ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1150/-, ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600/-, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జండర్ అభ్యర్థులకు రూ. 325/-
పరీక్ష తేదీ: 2025 డిసెంబర్ 18
చివరి తేదీ: 2025 అక్టోబర్ 10
దరఖాస్తు విధానం: ఆన్లైన్
వెబ్ సైట్: https://csirnet.nta.nic.in/