బోధన, పరిశోధనకు నెట్: యూజీసీ నెట్ డిసెంబర్ - 2025 నోటిఫికేషన్ విడుదల. జేఆర్ఎఫ్, పీహెచ్ డీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువుకు మార్గం
» యూజీసీ నెట్ డిసెంబర్ - 2025 నోటిఫికేషన్ విడుదల.
» జేఆర్ఎఫ్, పీహెచ్ డీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువుకు మార్గం.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) 2025 డిసెంబర్ సెషన్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. నెట్లో ప్రతిభ ద్వారా పరిశోధనలకు వీలు కల్పించే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)ను పొందొచ్చు. దీంతోపాటు బోధన రంగంలో అసిస్టెంట్ ప్రొఫెస ర్గా, అదేవిధంగా పీహెచ్ డీలో ప్రవేశం పొందేందుకు అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో.. యూజీసీ నెట్ 2025 డిసెంబర్ వివరాలు, ఈ పరీక్షతో ప్రయోజనాలు, ఎంపిక ప్రక్రియ. పరీక్ష విధానం, సిలబస్ అంశాలు, ప్రిపరేషన్ తదితర సమాచారం.
• సబ్జెక్టులు ఇవే..
అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హోంసైన్స్, హిస్టరీ, ఫోరెన్సిక్ సైన్స్, ఇండియన్ కల్చర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లింగ్విస్టిక్స్ తదితరాలు,
• అర్హత:
కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ -ఎన్సీఎల్/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉం డాలి. అర్హత పరీక్ష ఫైనల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
• వయసు:
01.12.2025 నాటికి జేఆర్ఎఫ్ కు 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీ-ఎన్ సీఎల్ /ఎస్సీ / ఎస్టీ/దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది. పీహెచ్ఎకి, అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.
• ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
• మూడు కేటగిరీలుగా పరీక్ష:
యూజీసీ-నెట్ ను జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అడ్మిషన్ టు. పీహెచ్డీ అనే మూడు కేటగిరీల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరవుతామనే విషయాన్ని స్పష్టం చేయాలి.
» కేటగిరీ 1లో అవార్డ్ ఆఫ్ జేఆర్ఎఫ్ అండ్ అసి స్టెంట్ ప్రొఫెసర్.
» కేటగిరీ 2లో ఆపాయింట్మెంట్ యాజ్ ఆసి స్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పీహెచ్ఎ.
» కేటగిరీ 3లో అడ్మిషన్ టు పీహెచ్ డీ కేటగిరీని ఎంచుకోవాలి.
• అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాథమ్యాన్ని పరి గణనలోకి తీసుకుని ప్రశ్నలు అడుగుతారు.
• జేఆర్ఎఫ్ కు ఎంపికైన వారికి యూజీసీ నిబంధ నలకు అనుగుణంగా ఇంటర్వ్యూలు నిర్వహిం చి పీహెచ్ డీలో ప్రవేశం కల్పిస్తారు.
» కేటగిరీ 2, 3 అర్హత పొందిన వారిని కూడా పీహెచ్ఎలో ప్రవేశాలకు పరిగణనలో తీసుకునే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో నెట్ మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూ/వైవావోస్కు 30 శాతం వెయిటేజీ కల్పిస్తారు.
• పరీక్ష విధానం:
• కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.
» పేపర్-1 టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్న లు-100 మార్కులకు,
» పేపర్-2 సబ్జెక్ట్ సంబం దిత పేవర్ 100 ప్రశ్నలు-200 మార్కులకు ఉం టాయి. పరీక్ష సమయం మూడు గంటలు,
» పేపర్-1కు ఆసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్ధులందరూ తప్ప నిసరిగా హాజరు కావాలి.
» పేపర్-2ను అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్ ఆధారంగా యూజీసీ నెట్ అర్హత ఉన్న సబ్జె కు హాజరుకావాలి.
• కనీస అర్హత మార్కులు:
యూజీసీ నెట్కు సంబంధించి రెండు కేటగిరీల అభ్యర్థులు (జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్) ఉత్తీర్ణత సాధించాలంటే.. తాము రాసిన పేపర్లలో కనీస అర్హత మార్కులు పొందాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి 40 శాతం మార్కులు, రిజర్వ్ కేటగిరి అభ్యర్థులు 35 శాతం మార్కులు స్కోర్ చేయాలి.
• నెట్ ప్రయోజనాలు:
» అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో అధ్యాపక వృ త్తిలో సులభంగా ఆడుగు పెట్టొచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం-నెట్లో అసిస్టెంట్ ప్రొఫె సర్ కేటగిరీలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఈ పోస్లకు ఎంపిక చేయాలి.
» జేఆర్ఎఫ్ కు ఎంపికైతే ప్రముఖ రీసెర్చ్ లేబొరేట రీల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేయొచ్చు.
ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో పీహెచ్ డీ, రీసెర్చ్ అభ్యర్థుల ఎంపికలో నెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్లు పూర్తి చేసుకున్న వారికి సైంటిస్టుగా ప్రభుత్వ విభాగాల్లో కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తుంది.
• ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 07.10.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.11.2025.
పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది: 07.11.2025
దరఖాస్తు సవరణ తేదీలు: 10.11.2025 నుంచి 12.11.2025 వరకు
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ugcnet.nta.nic.in
రాత పరీక్షలో రాణించేలా..
యూజీసీ నెట్ లో విజయం సాధించేందుకు అభ్యర్థులు పరిశోధనల పట్ల తమకున్న ఆసక్తి మొదలు, సబ్జెక్ట్ పైనా పట్టు పెంచుకోవాలి.
• పేపర్-1
అభ్యర్థులందరికీ ఉమ్మడి పేపర్గా నిర్దేశించిన పేపర్-1లో టీచింగ్, రీసెర్చ్ అసక్తులను పరిశీలిం చే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పది విభాగాలు (టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టి ట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజిక ల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రైటే షన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకే షన్ సిస్టమ్-గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రీ షన్) నుంచి ఒక్కో వి భాగంలో అయిదు ప్రశ్నలు చొప్పున అడుగుతారు.
• పేపర్-2 సబ్జెక్ట్స్ సంబంధిత ప్రశ్నలు:
పేపర్-2లో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రశ్నలు పీజీ స్థాయిలో ఉంటాయి. అభ్యర్థులు తాము ఎం పిక చేసుకున్న సబ్జెక్ట్స్ కు సంబంధించి ఇంటర్మీడి యెట్ నుంచి పీజీ వరకు అన్ని అంశాలపై అవగా హన పెంచుకోవాలి. ఆయా సిలబస్ అంశాలను ఆప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్తో అధ్యయనం చేయాలి. పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేట ప్పుడు ప్రాక్టికల్ థింకింగ్, అప్లికేషన్ ఓరియెంటే షన్ కీలకంగా మారుతున్నాయి. దీంతోపాటు క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ అప్రోచ్ను పెంచు కుంటే పరీక్ష ప్రశ్నలు ఎలా అడిగినా సమాధా నాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
.jpeg)