బాల్మెర్ లారీలో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఖాళీలు
బాల్మెర్ లారీ డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 10.
పోస్టులు: డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్ అండ్ ఫైనాన్స్) 02, అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్ అండ్ ఫైనాన్స్) 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 27 ఏండ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 32 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరి మితిలో సడలింపు ఉంటుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: జులై 10.
పూర్తి వివరాలకు: balmerlawrie.com లో సంప్రదించగలరు.