ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-డి పోస్టుల భర్తీ
న్యూదిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్తర్న్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో 38 గ్రూప్-డి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
క్రీడాంశాలు: ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, రెజ్లింగ్, చెస్.
అర్హత: 10వ తరగతితో పాటు సంబంధిత క్రీడాంశంలో వివిధ స్థాయుల్లో ప్రతిభ చూపి ఉండాలి.
వయసు: 01/07/2024 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, మైనారిటీలు, ఈబీసీలకు రూ.250. ఇతరులకు రూ.400.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-05-2024.
ట్రయల్ తేదీ: 10-08-2024.
వెబ్ సైట్: https://www.rrcnr.org/