Type Here to Get Search Results !

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూరెప్ అండ్ మేనేజ్ మెంట్ (నిఫ్టైమ్) లో ఎంటెక్, ఎంబీఏ

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూరెప్ అండ్ మేనేజ్ మెంట్ (నిఫ్టైమ్) లో ఎంటెక్, ఎంబీఏ



హరియాణాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూరెప్ అండ్ మేనేజ్ మెంట్ (నిఫ్టైమ్) - ఎంటెక్, ఎంబీఏ ప్రోగ్రా మ్లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. సంస్థ నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్/నిర్దేశిత జాతీయ పరీక్ష స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్స నల్ ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. సంస్థ నిబంధనల ప్రకారం స్కాలర్షిప్ అందిస్తారు.

ఎంటెక్

ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. ఇందులో ఫుడ్ టెక్నా జీ మేనేజ్ మెంట్, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ మేనే జ్మెంట్ ఫుడ్ సప్లయ్ చెయిన్ మేనేజ్ మెంట్ ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్ మేనేజ్ మెంట్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఒక్కో స్పెషలైజేషన్లో 20 సీట్లు ఉన్నాయి. స్పెషలై జేషన్ కు నిర్దేశించిన ప్రకారం సంబంధిత సబ్జె కులతో బీఈ/బీటెక్/ పేజీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రథమ శ్రేణి మార్కులు తప్పని. సరి. గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉన్న అభ్యర్థులు సంస్థ నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ రాయనవసరం లేదు. ఎంపిక ప్రక్రియలో ముందుగా గేట్ అభ్యర్ధులకు ప్రాధాన్య మిస్తారు.

ఎంట్రెన్స్ టెస్ట్ వివరాలు: ఇందులో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి మొత్తం 30 ప్రశ్నలు, ఆభ్యర్థి ఎంచు కొన్ని సెక్షన్ నుంచి 70 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. సమా దానాన్ని తప్పగా గుర్తిస్తే పావు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం గంటన్నర.

సెక్షన్లు: ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, వెయిరీ టెక్నాలజీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్; ఫుడ్ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ ప్రాసెస్ ఇంజనీరింగ్, బయో కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఫుడ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్ షిప్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ అగ్రిక ల్చర్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.

ఎంబీఏ

ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. దీని స్పెషలైజేషన్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. ఈ ప్రోగ్రామ్లో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేసిన వారు అప్లయ్ చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి, క్యాట్/మ్యా టె/ సీమ్యాట్ వ్యాలిడ్ స్కోర్ ఉన్న అభ్యర్థులు సంస్థ నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ రాయనవసరం లేదు.

ఎంట్రెన్స్ టెస్ట్ వివరాలు: ఇందులో మొత్తం 50. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. లాజికల్ రీజ నింగ్ డేటా ఇంట్రప్రిటేషన్ నుంచి 15, క్వాంటిటేటివ్ అనాలిసిస్ నుంచి 15, వెర్బల్ ఎబిలిటీ/ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్పులు నిర్దేశించారు. మొత్తం మార్కులు 100, నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం గంటన్నర.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 15 

గేట్/క్యాట్/న్యూట్/సీమ్యాట్ స్కోర్ ఆధారంగా మెరిట్ విస్ట్ విడుదల: మే 17

నాన్ క్యాట్/మ్యాట్/సీమ్యాట్ అభ్యర్థులకు ఎంట్రెన్స్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు: మే 30 

ఎంబీఏ ప్రోగ్రామ నకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: జూన్ 3

గేట్ అభ్యర్థులకు కౌన్సెలింగ్: మొదటి రౌండ్ మే 20 నుంచి 22 వరకు రెండో రౌండ్-మే 27 నుంచి 28 వరకు. మూడో రౌండ్- జూన్ నుంచి 5 వరకు

ఎంటెక్ మిగిలిన సీట్ల వివరాల వెల్లడి: జూన్ 7

నాన్ గేట్ అభ్యర్థులకు ఎంట్రెన్స్ టెస్ట్: జూన్ 17

నాన్ గేట్ అభ్యర్థుల ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల: జూన్ 19

నాన్ గేట్ అభ్యర్థులకు కౌన్సెలింగ్:  జూన్ 20 నుంచి 23 వరకు 

వెబ్ సైట్: www.niftem.ac.in

👁️‍🗨️ DOWNLOAD ADMISSION BROCHURE 2024-25

Get More Information Plese Click Here:👇

🔗 https://niftem.ac.in/newsite/?page_id=1494

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area