Type Here to Get Search Results !

ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ / ఇండియన్ స్టాటిస్టీ కల్ సర్వీస్ ఎగ్జామినేషన్ -2024 నోటిఫికేషన్ - యూపీఎస్సీ ఐఈఎస్/ఐఎస్ఎస్ఈ 2024.

ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ / ఇండియన్ స్టాటిస్టీ కల్ సర్వీస్ ఎగ్జామినేషన్ -2024 నోటిఫికేషన్ - యూపీఎస్సీ ఐఈఎస్/ఐఎస్ఎస్ఈ 2024.



ఎకనామిక్స్ / స్టాటిస్టికల్ సర్వీసుల్లో జూనియర్ టైం స్కేల్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టీ కల్ సర్వీస్ ఎగ్జామినేషన్ -2024 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తోంది. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్లో 18 పోస్టులు, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్లో 30 పోస్టులు చొప్పున మొత్తం 48 పోస్టులు.

అర్హత: ఎకనామిక్ సర్వీస్ కు పీజీ(ఎకనామిక్స్/అప్లయిడ్ ఎకనామి ర్స్ బిజినెస్ ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్) స్టాటిస్టికల్ సర్వీస్ కు డిగ్రీ స్టాటిస్టిక్స్/ మేథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లయిడ్ స్టాటిస్టిక్స్) లేదా పీజీ స్టాటిస్టిక్స్/ మేడమెటికల్ ప్లాటిస్టిక్స్ / అప్లయిడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీ ర్హులై ఉండాలి. అభ్యర్థుల వయను 2024 ఆగస్టు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.

పరీక్ష వివరాలు:

• ఇందులో రాత పరీక్ష వైనా-వోస్ అనే రెండు పార్ట్లు ఉంటాయి. రాత పరీక్షకు 1000 మార్కులు, వైవాకు 200 మార్కులు నిర్దేశించారు. తరవాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టు కూడా ఉంటాయి.

• ఇండియన్ ఎకనామిక్ సర్వీస్కు నిర్వహించే రాత పరీక్షలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ సబ్జెక్టులకు ఒక్కోడానికి 100 మార్కులు, జనరల్ ఎకనామిక్స్-1, జనరల్ ఎకనామిక్స్-2, జన రల్ ఎకనామిక్స్డ్% సబ్జెక్టులకు ఒక్కోదానికి 300 మార్కులు నిర్దేశించారు. ఒక్కో సబ్జెక్టుకు 3 గంటల సమయం ఇస్తారు.

• ఐడియన్ స్టాటిస్టికల్ సర్వీస్కు నిర్వహించే రాత పరీక్షలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ సబ్జెక్టులకు ఒక్కదానికి 100 మార్కులు, మూడు గంటల పరీక్ష సమయం కేటాయించారు. 

స్టాటిటిక్స్ 1 (ఆబ్జెక్టివ్), స్టాటిటిక్స్ 2 (ఆబ్జెక్టివ్) ఒక్కో దానికి 200 మార్కులు, రెండు గంటల పరీక్ష సమయం నిర్దే శించారు. స్టాటిస్టిక్స్ - 3 (డిస్క్రిప్టివ్) స్టాటిస్టిక్స్ - 4(డిస్క్రిప్టివ్) సబ్జెక్టులకు ఒక్కోడానికి 200 మార్కులు, మూడు గంటల పరీక్ష సమయం నిర్దేశించారు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ. 2000 మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30

ఐఈఎస్/ఐఎస్ఎస్ఈ 2024 ఎగ్జామ్ తేదీ: జూన్ 21

వెబ్ సైట్: 

www.upsc.gov.in/

upsconline.nic.in

🔗 STEPS FOR APLICANTS 

👁️‍🗨️ DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area