Type Here to Get Search Results !

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ ఎస్ డి) లో డిప్లొమా

 నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ ఎస్ డి) లో డిప్లొమా



ప్రపంచంలోనే తొలి థియేటర్ ట్రైనింగ్ సంస్థగా 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా'గా పేరుంది. 1959లో సంగీత నాటక అకాడమీ విభాగంగా ఈ సంస్థ ఆరంభమైంది. 1975లో స్వతంత్ర ప్రతిపత్తిని పొందింది. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ విభాగం నిధులతో ప్రస్తుతం పనిచేస్తోంది. తగు జాగ్రత్తలతో ఒక ప్రణాళిక ప్రకారం రూపొందించిన సిలబస్, శిక్షణతో పకడ్బందీగా సంస్థను నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సంస్థ డ్రమటిక్ ఆర్స్లో మూడేళ్ళ కాలవ్యవధి కలిగిన డిప్లొమాకు నోటిఫికే సన్ విడుదల చేసింది. ఈ కోర్సులో చేరిన విద్యార్థులను యాక్టింగ్ డిజైన్, డైరక్షన్కు తోడు థియేటర్ సంబంధ డిసిప్లిన్స్లో ప్రొఫెషనల్గా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కోర్సు ఇది. ఈ ఏడాది జూలై 24 నుంచి కోర్సు ఆరంభమవుతుంది. సీట్లు 32 కాగా వీటిలో మూడింటిని విదేశీ విద్యార్థులకు కేటాయించారు. హిందీ ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధన ఉంటుంది.

అర్హత: ఏ డిసిప్లిన్లో అయినా మూడేళ్ళ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆరు వేర్వేరు థియేటర్ ప్రొడక్షన్స్లోపాల్గొని ఉండాలి. అందుకు తగు ప్రూఫ్ర్ ని సమర్పించాలి. హిందీ/ ఇంగ్లీష్ భాషలు తెలిసి ఉండాలి. ఈ ఏడాది జూలై 1 నాటికి వయసు 18-30 మధ్య ఉండాలి. రిజ ర్వుడు వర్గాలకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.

ఎంపిక: ఇది రెండు దశలుగా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఎంపి కైన వారికి ఫైనల్ ఎగ్జామినేషన్ వర్క్షాప్ ఉంటుంది. దేశంలోని వివిధ నగరాల్లో వేర్వేరు తేదీల్లో ఈ రెండూ జరుగుతాయి. హైదరాబాద్లో మే 27న జరుగుతుంది. వివరాలు ఎన్ఎ ఎడీ వెబ్సైట్లోనూ ఉంటాయి. తుది ఎంపిక న్యూఢిల్లీలో ఉంటుంది. జూన్ 23 నుంచి 27 వరకు అంటే అయిదు రోజులు ఉంటుంది. దీనికి పిలిచిన అభ్యర్థులకు వారి సొంత ఊరి నుంచి ట్రావెల్ ఎక్స్టెన్సస్కు తోడు డీఏ చెల్లిస్తారు. నిపుణులతో కూడిన కమిటీ వీరి ప్రతి భను పరిశీలించి తుది ఎంపిక జరుపుతుంది. పీజికల్ ఫిట్నెస్ తప్పనిసరి. అందుకు మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది.

కోర్సు వివరాలు: కోర్సు కాల వ్యవధి మూడేళ్ళు కాగా ఆరు సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్ 20 వారాల పాటు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లు కామన్ చివరి మూడు సెమిస్టర్లలో స్పెషలైజేషన్ ఉంటుంది. ఇందులో డిజైన్, డైరక్షన్లో మాత్రం అయిదుగురు విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది కోర్సుకు ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ. 9,500 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.50, 

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 10

చిరునామా:

NATIONAL SCHOOL OF DRAMA, 

Bahawalpur House, 

Bhagwandas Road, 

New Delhi-110001

వెబ్ సైట్: 

🔗 www.nsd.gov.in 

🔗 http://www.onlineadmission.nsd.gov.in

🔗 CLICK HERE TO REGISTER

🔗 USER LOGIN


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area