Type Here to Get Search Results !

ఎస్.ఎస్.సి - కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్- 2024

ఎస్.ఎస్.సి - కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్- 2024



కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2024' (సీహెచ్ఎస్ఎల్) ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దాదాపు ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టులు: 3,712

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్చు ఉత్తీర్ణత 01-08-2024 నాటికి ఇంటర్ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ, కల్చర్ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్ సైన్స్ గ్రూపుతో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.

వయసు: 01-08-2024 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీ బట్టి 10-15 ఏళ్లు గరిష్ట వయసులో పదలింపులు వర్తిస్తాయి.

ఎంపిక: టైర్-1, టైర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని  మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్ధులకు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్ బెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.

అన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-05-2024, 

ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 08-05-2024

దరఖాస్తు సవరణ తేదీలు: 10-05-2024 నుంచి 11-06-2024 వరకు. 

టైర్-1(కంప్యూటర్ ఆధారిత పరీక్ష): జూన్, జులై లో 

టైర్-2 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): వివరాలు తర్వాత ప్రకటిస్తారు.

వెబ్ సైట్: https://ssc.gov.in/


👁️‍🗨️ DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area