గ్రూప్-2.. సక్సెస్ ప్లాన్
ఆగస్ట్ 29, 30 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు
పోటీలో అయిదున్నర లక్షల మంది అభ్యర్థులు
నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే విజయం
గ్రూప్ -2 సర్వీసెస్ పరీక్ష..! తహశీల్దార్, ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్, ఏసీ వంటి క్రేజ్ పోస్ట్లు ఉం డే సర్వీసు! గెజిటెడ్ ర్యాంకుతో కొలువు ఖరారు చేసే పరీక్ష! అన్నింటికీ మించి సర్కారీ కొలువు. సొంతం చేసుకునే అవకాశం! అందుకే గ్రూప్ 2కు లక్షల మంది పోటీపడుతుంటారు. తెలంగా ణలో గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్య ర్థులు తమ ప్రిపరేషన్ ను మరింత పదును పెట్టా లిన సమయం ఆసన్నమైంది. కారణం. పరీక్ష తేదీలు సమీపిస్తుండడమే! ఆగస్ట్ 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు టీ ఎస్ పి ఎస్ సి సన్నాహకాలు చేస్తోంది. ఈ నేపథ్యం లో గ్రూప్ 2లో విజయానికి ప్రిపరేషన్ ప్లాన్...
మొత్తం 783 పోస్ట్లకు 5,51, 943 మంది దర ఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అంటే ఒక్కో పోస్ట్లు 705 మంది పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ స్థాయి పోటీలో నెగ్గాలంటే అభ్యర్థులు పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి.
సిలబస్ కు సరితూగే...
గ్రూప్-2 అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో, ఇప్పటివరకు చదివిన అం శాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇప్పుడు కొత్త పుస్త కాల జోలికి వెళ్లకుండా.. సిలబస్ కు సరితూగే పరి మిత పుస్తకాలను మాత్రమే చదవాలి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ దశలకు సంబంధించిన అంశా లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అన్ని ముఖ్యమైన ఘట్టాలున్న ఒకట్రెం డు పుస్తకాలను ఎంచుకోవడం మేలు. అదే విధంగా ఆకాడమీ పుస్తకాలను చదవడం ఎంతో ఉపయుక్తం గా ఉంటుంది.
విశ్లేషణాత్మక అధ్యయనం...
గ్రూప్ 2లో విజయానికి విశ్లేషణాత్మక అధ్య యనల ముఖ్యం. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉం టుంది. కాని అన్ని కోణాల్లో అవగాహన ఉంటేనే సమాధానాలు గుర్తించగలిగేలా ప్రశ్నలు అడిగే అవ కాశముంది. కాబట్టి ప్రస్తుత సమయంలో డిస్క్రిప్టివ్ విధానంలో చదువుతూ.. ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ చదివేలా సమయ పాలన పాటించాలి..
కామన్ టాపిక్స్...
అభ్యర్ధులు కామన్ టాపిక్స్ను ఒకే సమయంలో చలా ప్లాన్ చేసుకోవాలి. పరీక్ష సిలబస్ కు అను గుణంగా ఆయా సబ్జెక్ట్లోని ఉమ్మడి అంశాలను గుర్తించి.. వాటిని అనుసంధానం చేసుకుంటూ చద వాలి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేష నల్ రిలేషన్స్: భారత రాజ్యాంగం, పరిపాలన ఏకా నమీ అండ్ డెవలప్మెంట్.. ఇలా అన్ని అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది. ప్రతి రోజు సగటున 8 నుంచి 10 గంటల సమయం ప్రిప రేషన్కు కేటాయించేలా టైమ్ టేబుల్ రూపొందిం. చుకోవాలి.
ఏదీ వదలకుండా...
ఇప్పటి వరకు ప్రిపరేషన్ను పూర్తి చేసే క్రమంలో ఏమైనా టాపిక్స్ వదిలేస్తే వాటిపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవిర్భావ దశ, మలి ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ చది త్రలో తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియ జేసే టాపిక్స్ను లోతుగా చదవాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు.. ఇలా అన్ని అంశాలపై దృష్టి పెట్టాలి.
సొంత నోట్స్...
అభ్యర్థులు ఇంతకాలం రాసుకున్న సొంత నోట్స్ ను సర్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన అం శాలు, పాయింట్లతో రాసుకున్న నోట్స్ ను పదే పదే చదువుతూ ముందుకు సాగాలి. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉదా హరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసు కుంటే...ఆ వర్గాల నిర్వచనానికే పరిమితం కాకుం డా.. వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థి తులు.. ఇలా అన్నింటినీ చదవాలి. అప్పుడే ఒక అం శంపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది..
ప్రభుత్వ విధానాలు
• రాష్ట్ర స్థాయిలో సామాజిక సమస్యలు, వాటిపై ప్రభుత్వాలు చేసిన విధానాలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం ప్రభుత్వ విధానాలపై ప్రచురితమైన అధికారిక డాక్యుమెంట్లను పరిశీలించాలి. ఇందు లో మహిళా సాధికారత వంటివి ముఖ్యమైనవి. మహిళల సాధికారత కోసం జాతీయస్థాయిలో రకరకాల పథకాలు తెచ్చారు. మైనారిటీ, వెనుక బడిన తరగతులు, గిరిజన సంక్షేమం కోసం విధా -నాలు రూపొందించారు. అదే విధంగా పలు నూతన పాలసీలు రూపొందుతున్నాయి. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి.
• తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్న నీళ్లు.. నిధులు.. నియామకాలు.. వంటి వాటిపై ఎలాంటి విధానాలు తెచ్చారో తెలుసుకో వాలి. రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన పాలసీలపై అవగాహన పెంచు కోవాలి. ఎస్సీలు,ఎస్టీలు,మహిళలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, గిరిజనులకు సంబంరించి తెచ్చిన పథకాలను అధ్యయనం చేయాలి.
పేపర్ -1కు ప్రత్యేకంగా...
గ్రూప్-2 అభ్యర్థులు పేపర్-4పై ప్రత్యేకంగా దృ ష్టిపెట్టాలి. ఇందులో తెలంగాణ ఆలోచన (1948- 1970), ఉద్యమ దశ(1971-1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం (1991-2014)).. అన్ మూడు దశలను పేర్కొన్నారు. ముఖ్యంగా సిలబ స్లో నిర్దేశించిన ప్రకారం- 1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకూ జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు. ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు - వాటి సిఫార్సు. లపై పట్టు సాధించాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్ 3) సామాజిక వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు: తెలంగాణకు కల్పించిన హక్కులపై దృష్టి సారించాలి.
'స్పెషల్' ఫోకస్...
అంశాలను చదివేటప్పుడు.. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ. తెలంగాణ ఎకానమీ పేరుతో ప్రత్యేకంగా ఉన్న టాపిక్స్ను మరింత లోతుగా అధ్యయనం చేయాలి. చరిత్రలో తెలంగాణలో రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పం చాలు, తెలంగాణలోని కవులు - రచనలు, కళలు, ముఖ్య కట్టడాలు-వాటిని నిర్మించిన రాజులు తది తర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధం గా స్వాతంత్ర్యోద్యమ సమయంలో తెలంగాణ ప్రాం త ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన ఏర్ప రచుకోవాలి. తెలంగాణలోని ముఖ్యమైన నదులు- పరీవాహక ప్రాంతాలు, ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యమున్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం-విస్తీర్ణం, జనాభా వంటి అంశా లపైనా అవగాహన అవసరం. ఎకానమీలో తెలం గాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు: ముఖ్యమైన పరిశ్రమ లుఉత్పాదకతతోపాటు, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన పెంచుకోవాలి. తాజా బడ్జెట్ గణాంకాలు, ఆయా శాఖలు, పథకాలకు కేటాయిం పులపై పట్టు సాధించాలి.
రివిజన్... రివిజన్...
గ్రూప్-2 అభ్యర్ధులు పునశ్చరణకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని గ్రహించాలి. పరీక్ష తేదీలకు కనీసం పది రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజ నకు సమయం కేటాయించుకోవాలి. రివిజన్ సమ యంలో షార్ట్ నోట్స్, సొంత నోట్స్ లను అనుసరిం చాలి. దీంతోపాటు ప్రీవియస్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ సాధన కూడా గ్రూప్ 2 పరీక్షలో విజయానికి దోహదం చేస్తుంది.