DRDO NSTL Recruitment | వైజాగ్ డీఆర్‌డీవో- ఎన్‌ఎస్‌టీఎల్‌లో 62 పోస్టులు
DRDO NSTL Recruitment 2023 | మెకానికల్ ఇంజినీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్., ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Graduate Apprentice), డిప్లొమా అప్రెంటిస్ (Diploma), ట్రేడ్ అప్రెంటిస్ (Trade Apprentice) పోస్టుల భర్తీకి విశాఖపట్నం (Visakhapatnam) లోని డీఆర్‌డీవోకు చెందిన నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL) ప్రకటన విడుదల చేసింది. దరఖౄస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అకడమిక్ మెరిట్/ రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 62
పోస్టులు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Graduate Apprentice), డిప్లొమా అప్రెంటిస్ (Diploma), ట్రేడ్ అప్రెంటిస్ (Trade Apprentice)
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : అకడమిక్ మెరిట్/ రాత పరీక్ష/ఇంటర్వ్యూ
వయస్సు : 18 ఏండ్లు నిండి ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి: 1 ఏడాది.
స్టైపెండ్ : నెలకు రూ.8000 నుంచి రూ.9000.
చివరితేదీ : జూలై 08
వెబ్‌సైట్ : https://www.drdo.gov.in/