జర్మనీలో స్టాఫ్ నర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
బిఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి జర్మనీలో స్టాఫ్ నర్సెస్ గా అవకాశం కల్పిస్తు న్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. దిల్లీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎ ఎఎస్ఓసీ) - టిఏకెటి ఇంటర్నేషనల్-ఆంధ్రప్రదేశ్ నాన్-రెసి డెంట్ తెలుగు సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారికి జర్మనీలో స్టాఫ్ నర్సెస్ అవ కాశం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. అభ్యర్థులు 20 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగి, కనీసం రెండు సంవత్సరాలు సాధారణ ఆసుపత్రుల్లో పనిచేసిన అను భవం ఉండాలని తెలియజేసారు.
జర్మన్ భాష నేర్చుకునేందుకు ఆసక్తి, అక్కడ పనిచేయ డానికి సిద్ధంగా ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులకు కేఎల్ విశ్వవిద్యాలయంలో జర్మన్ భాషపై ఉచిత ఆన్లైన్ తరగతులకు హాజరు కావాలని తెలిపారు. బి1 స్థాయి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, జర్మనీలో పని చేయడానికి ఆఫర్ లెటర్ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అభ్యర్థుల ప్రయాణం కోసం విమాన చార్జీలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలియజేసారు. మొదటి 6 నెలల పాటు ఆహారం, వసతి ఉచితమని, నెలకు వేతనం వెయ్యి యూరోలు (భారతీయ కరెన్సీ రూ.89,000లు), అనంతరం ఆరు నెలల పాటు జర్మ నీలో బి2 సర్టిఫికేషన్ కోసం శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. బి2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు దాదాపు 2,500 యూరోల వేతనం పొందవచ్చునని తెలిపారు. ఈ నెల 30వ తేదీ రిజిస్ట్రేషన్కు చివరి తేది అని www.apssdc.in/home/onlineprogram-registration ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికేట్ రెజ్యూమ్ ను helpline@apssdc.in మెయిల్ ఐడీ లేదా కాల్ సెంటర్ 9988853335 నెంబర్కు పంపించాలని కలెక్టర్ ప్రకటనలో తెలియజేసారు.