నాలుగేళ్లలోనే డిగ్రీ ప్లస్ బీఈడీ : ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల
• నవీన బోధన విధానాలతో ప్రణాళిక
• రాష్ట్రంలో 150 సీట్లు.
• జూలై 19 వరకు దరఖాస్తులు.
సమీకృత బీఈడీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ తర్వాత నాలుగేళ్ల లోనే డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేయవచ్చు. సాధారణం గా బీఈడీ చేయాలంటే మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసి, రెండేళ్ల బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలి. దీనికి మొత్తం ఐదేళ్లు పడుతుంది. కొత్త విధానం వల్ల నాలుగేళ్లలోనే పూర్తి చేసే వీలుంది. జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా తీసుకొచ్చిన ఈ కోర్సును జాతీయ స్థాయిలో పలు కళాశా లల్లో ప్రవేశపెడుతున్నారు. వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీఏ) దేశ వ్యాప్తంగా 178 పట్టణాల్లో 13 మాధ్యమాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ) నిర్వహి స్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషనన్ను సోమవారం అర్ధరాత్రి ఎన్టీఏ విడుదల చేసింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో రెండు వర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్టీఏ 2023-24 విద్యా సంవత్సరానికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మొత్తం 150 సీట్లలో ప్రవే శాలు కల్పించనున్నారు. ఆధునిక విద్యా బోధనకు అనుగుణంగా సమీకృత బీఈడీ కోర్సును ఎన్సీఈఆర్ దించింది. విద్యార్థి మానసిక ధోరణి, ఆన్లైన్, డిజిటల్ విద్యా బోధనతో పాటు సరికొత్త మెలకువలతో ఎలా బోధిం చాలన్న అంశానికి ఈ కోర్సులో అత్యధిక ప్రాధాన్యమి స్తారు. తరగతి గదిలో పాఠాల కన్నా, అనుభవం ద్వారా నేర్చుకునే రీతిలో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 19.7.2023
డేటా కరెక్షన్కు చివరి తేదీ : 20.7.2023
పరీక్ష తేదీ : తర్వాత ప్రకటిస్తారు.
హాల్ టికెట్ల డౌన్లోడ్ : పరీక్షకు మూడు రోజుల ముందు.
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్లు : www.nta.ac.in, https://neet.samarth.ac.in/