ఇండియన్ నేవీలో ఎస్.ఎస్.సీ ఆఫీసర్లు
ఎజిమల (ఐఎస్ఏ)లోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ ఏ)లో 2024, జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన నోటి ఫికేషన్ విడుదలైంది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
కోర్సు: షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆఫీసర్ - జనవరి 2024
బ్రాంచి వివరాలు :
1. జనరల్ సర్వీస్: 50 పోస్టులు
2. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 10
3. నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 20
4. పైలెట్: 25
5. లాజిస్టిక్స్: 30
6. నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టర్ కేడర్: 15
7. ఎడ్యుకేషన్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 12
8. ఇంజనీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 20
9. ఎలక్ట్రికల్ బ్రాంచ్(జనరల్ సర్వీస్): 60
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతోపాటు నిర్ధిష్ట శారీరక/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100, ఇతర అలవెన్సులు
ఎంపిక విధానం: అకడమిక్ స్కోరు, ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 14
వెబ్సైట్: www.joinindiannavy.gov.in/