Type Here to Get Search Results !
🔥 Latest Jobs

వాయుసేనలో కొలువులకు ‘అగ్నివీర్’

వాయుసేనలో కొలువులకు ‘అగ్నివీర్’

 


భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహణకు యువతకు ఒక సువర్ణావకాశమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 9, 12వ తేదీలలో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులు ముందుగా ఎలాంటీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన తెలిపారు.

అర్హత కలిగిన వారు నేరుగా ర్యాలీలో పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళా అభ్యర్థులకు, మార్చి 12వ తేదీ ప్రత్యేకంగా ర్యాలీ నిర్వహించనున్నారు.

అభ్యర్థులు 02.07.2005 నుంచి 02.01.2009 మధ్య జన్మించి ఉండాలని, కనీసం 152 సెం.మీ ఎత్తు ఉండాలని కలెక్టర్ వివరించారు.

విద్యార్హతల విషయానికి వస్తే… ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఒకేషనల్ కోర్సులో కనీసం 50 శాతం మార్కులు, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

49.99 శాతం మార్కులు ఉన్నా కూడా అనర్హులుగా పరిగణిస్తారని ఆయన గుర్తు చేశారు.

ర్యాలీకి వచ్చే అభ్యర్థులు తమ వెంట విద్యార్హత ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్స్‌తో పాటు ఆధార్ కార్డు, డొమిసైల్ సర్టిఫికెట్, ఎన్సీసీ (ఉంటే), 10 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ప్రతి సర్టిఫికెట్‌కు 6 సెట్ జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని సూచించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area