రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలాలో 550 యాక్ట్ అప్రెంటిస్లు
కపుర్తలా(పంజాబ్)లోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ(ఆర్సీఎఫ్) యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోం ది. దేశవ్యాప్తంగా ప్రముఖ కోచ్ తయారీ యూనిట్లలో ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
• మొత్తం ఖాళీల సంఖ్య: 550.
• ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ఎస్ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్
• అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
• వయసు: 07.01.2020 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
• ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
• దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
• ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.01,2026.
• వెబ్ సైట్: https://rcf.indianrailways.gov.in
.jpeg)