సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ సీఈపీటీఏఎంలో టెక్నికల్ ఉద్యోగాలు
సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ (డీఆర్డీఓ సీఈపీటీఏఎం) సీనియర్ టెక్నికల్ అసి స్టెంట్-బి. టెక్నీషియన్-ఏ పోస్టుల భర్తీకి నోటిఫికే షన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫారమ్ సమర్పించడానికి చివరి తేదీ: జనవరి 01.
పోస్టుల సంఖ్య: 764.
ఖాళీల వివరాలు:
• సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి(ఎన్టీఏ-బి) 561,
• టెక్నీషియన్ -ఏ (టెక్-ఏ) 203.
అర్హత:
▪️సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (ఎస్ఏ-బీ):
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఎస్సీ లేదా 3 సంవత్సరాల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
▪️టెక్నీషియన్ -ఏ (టెక్-ఏ):
గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్లో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2026, జనవరి 1 నాటికి ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు బి.టెక్. /బీఈ, ఎంఎస్సీ, పీహెచ్ఎ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు కాదు.
వయోపరిమితి (2026, జనవరి 01 నాటికి):18 నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 11,
అప్లికేషన్ ఫీజు: ఎన్టీఏ-బీ పోస్టులకు అన్ రిజర్వ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎన్టీఏ-ఏ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడ బ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జనవరి 01
సెలెక్షన్ ప్రాసెస్: టైర్-1, టైర్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినే షన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు వెబ్సైటు: www.drdo.gov.in
.jpeg)