నేటి మేటి నైపుణ్యాలివే..!
ఏఐ ప్రవేశంతో జాబ్ మార్కెట్ ఎన్నడూ లేనంత వేగంగా మారిపో తోంది. ఈ ఏడాది పలు ప్రత్యేక స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఆఫర్లు భారీగా లభించినట్లు తాజా నివేదికలు వెల్లడి స్తున్నాయి. 2025 ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ ఏడాది టాప్లో నిలిచిన నైపుణ్యాలు కొత్త సంవత్సరం లోనూ కొలువులు ఖాయం చేయను న్నాయి. ఆ స్కిల్స్ ఏంటి, వాటికున్న డిమాండ్ గురించి తెలుసుకుందాం...
జనరేటివ్ అండ్ మెషిన్ లెర్నింగ్
జనరేటివ్ ఏఐ.. 2025 జాబ్ మార్కెట్లో హాట్ కేక్ మాదిరిగా బాగా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా చాట్ జీపీటీ, కోపైలెట్ వంటి వాటిని ఉపయోగించి ఏఐ టూల్స్ను రూపొందించడం ముఖ్యమైన నైపుణ్యం గా మారింది. ఎందుకంటే.. ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు తమ పనివిధానాల్లో ఏఐ వినియోగాన్ని పెంచుతున్నాయి. దీంతో ఏఐ నిర్వ హణ మాత్రమే కాకుండా ఏఐని ఉపయోగించి కొత్త టూల్స్ను నిర్మించ గలిగే ప్రతిభావంతులకు బాగా డిమాండ్ పెరిగింది. ఇండియా స్కిల్ రిపోర్ట్ - 2025, ఇండియాస్ ప్యూచర్ ఆఫ్ వర్క్ రెడీనెస్ నివేదికల్లో టాప్లో నిలిచిన నైపుణ్యం ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్.
డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్
నేటి పోటీ ప్రపంచంలో బిజినెస్ వ్యూహాలు రూపొందించేందుకు, ప్రధాన మైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేందుకు డేటా కీలకంగా మారింది. దీంతో డేటా విశ్లేషణ నైపుణ్యాలున్న వారికి భారీగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా స్టాటిస్టికల్ అనాలసిస్, డేటా విశ్లేషణ ఆధారంగా వ్యాపార సమస్యను స్పష్టం గా, లోతుగా అవగాహన చేసుకొని దృశ్య రూపం(గ్రాఫ్లు, చార్టులు)లో ప్రద ర్శించగలిగే నైపుణ్యం ఉన్న నిపుణులకు కంపెనీలు ఎర్ర తివాచీ పరు స్తున్నాయి. పైథాన్, ఎస్ క్యూఎల్, డేటా స్టోరీటెల్లింగ్, డేటా విజువలైజేషన్పై పట్టుతో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
క్లౌడ్ కంప్యూటింగ్
క్లౌడ్ కంప్యూటింగ్.. ఇంటర్నెట్ ద్వారా సర్వర్లు, డేటాబేస్లు, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్ వంటి సేవ లను అందిస్తుంది. ఇది క్లౌడ్ అని పిలిచే ఆన్లైన్ నిల్వ స్థలం ద్వారా జరుగుతుంది. దీనిద్వారా విని యోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎక్కడి నుంచైనా ఫైట్లు, అప్లికేషన్లను యాక్సెస్ చేసు కోవచ్చు. ఇటీవల ఖర్చు తగ్గించుకునేందుకు అనేక సంస్థలు క్లౌడ్ విధానానికి మారుతు న్నాయి. దీంతో ఈ క్లౌడ్ వ్యవస్థల నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలున్న నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఏడబ్ల్యూ ఎస్ నైపుణ్యం, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ పై పట్టు ముఖ్యంగా ఆర్కి టెక్టర్, మైగ్రేషన్, హైబ్రిడ్ క్లౌడ్పై అవగాహన ఉన్న వారికి కంపెనీలు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. దీం తోపాటు క్లౌడ్ సెక్యూరిటీ, డెవ్లప్స్, సర్వర్స్ కంప్యూటింగ్ కీలకంగా మారుతున్నాయి.
సైబర్ సెక్యూరిటీ
ఆన్లైన్ కార్యకలాపాలు, డిజిటల్ డేటా పెరు గుతున్న కొద్దీ సైబర్ దాడుల ముప్పు రెట్టింప వుతోంది. వ్యక్తుల నుంచి వ్యవస్థల వరకూ సైబర్ దాడుల బారిన పడి రూ.కోట్లలో నష్టపో తున్నారు. దీంతో గతంలో ఎన్నడూలేనంతగా సైబర్సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ ఏర్ప డింది. 2025 లో టాప్ టెక్నికల్ స్కిల్గా సైబర్ సెక్యూరిటీ నిలిచింది. ఈ రంగంలో కొలువు సొంతం చేసుకునేందుకు ఎథికల్ హ్యాకింగ్, రిస్క్ అసెస్మెంట్, నెట్వర్క్ సెక్యూరిటీ, క్లాడ్ సెక్యూరిటీ నైపుణ్యాలుండాలి.
డిజిటల్ మార్కెటింగ్
నేటి ఈ కామర్స్ ప్రపంచంలో ఆన్లైన్లో విని యోగదారులను ఆకట్టుకునే విధానమే డిజిటల్ మార్కెటింగ్, ఇంటర్నెట్ ద్వారా వస్తు సేవలకు ప్రచారం కల్పించే విధానం ఇది. ఏఐ ఆధారిత మార్కెటింగ్ గా రూపాంతరం చెందుతోంది. దీంతో డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో కెరీర్ అవకాశాలు సొంతం చేసుకునేందుకు ఎస్ఈవో (సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్), కంటెంట్ మార్కె టింగ్, ఏఐ అసిస్టెడ్ కాపీ రైటింగ్, మార్కెటింగ్ అనలిటిక్స్ స్కిల్స్ కీలకంగా మారుతున్నాయి.
సాఫ్ట్ స్కిల్స్ ముఖ్యమే...
టెక్నికల్ నైపుణ్యాలతోపాటు క్లిష్ట సమస్యలను విశ్లేషించగలిగే నైపు ణ్యాలు, వ్యూహాత్మకంగా ఆలోచించడం, ఇన్నోవేటివ్ థింకింగ్ ఉన్న వారు అత్యంత విలువైన మానవ వనరులుగా కంపెనీలు పరిగణిస్తున్నట్లు తాజా సర్వేలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు నేర్చుకోవాలనే ఆసక్తి, తపన, మార్పులను వేగంగా ఆకళింపు చేసుకోవడం, పరిస్థితులకు తగ్గట్లు తమను తాము మలచుకునే నేర్పు, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ను కలిగి ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. టెక్నికల్ స్కిల్స్పై పట్టుతోపాటు టెక్నాలజీ, ఆటోమేషన్, ఏఐ, డిజిటలై జేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీపట్ల సౌకర్యవంతంగా ఉండే మానవ వన రులు కావాలని భావిస్తున్నాయి. అలాగే సోషల్ స్కిల్స్, సహానుభూతి (ఎంపతీ) వంటివి పని ప్రదేశాల్లో ప్రాదాన్యం సంతరించుకుంటున్నాయి.
.jpeg)