భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) హైదరాబాద్లో 156 ట్రేడ్ అప్రెంటిస్లు
హైదరాబాద్ కాంచన్ బాగ్ యూనిట్లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ)ల ఖాళీల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 156.
» ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్టర్-70, ఎలక్ట్రిషియన్-10, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-30, మెషినిస్ట్-15, మెషినిస్ట్ గ్రైండర్ 02, మెకానికల్ డీజిల్-05, మెకానిక్ ఆర్-ఏసీ -05. టర్నర్-15, వెల్డర్-04.
» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 08.12.2025 నాటికి 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: విద్యార్హతలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుఫార మ్తో పాటు అవసరమైన సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను జతచేసి మేనేజర్(హెచ్ ఆర్) అప్రెంటిస్, భారత్ డైనమిక్స్ లిమిటె ద్(బీడీఎల్), కాంచన్బాగ్, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.12.2025
» ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.12.2025.
» వెబ్ సైట్: https://bdl-india.in
.jpeg)