బీఆర్ ఐసీ-ఎన్సీసీఎస్లో పీ హెచ్ డి కోర్సులో ప్రవేశాలు
పుణె(మహారాష్ట్ర)లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్(బీఆర్ ఐసీ) నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్(ఎన్ సీసీఎస్) సెల్ అండ్ మాలిక్యులర్ మోడరన్ బయాలజీలో పరిశోధనకు పీహెచ్డీ మార్చి-2026 సెషన్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది.
» అర్హత: పీజీ ఉత్తీర్ణతతో పాటు సీఎస్ఐఆర్-యూజీసీ, డీబీటీ, ఐసీఎంఆర్, బీఐఎస్సీ నుంచి చెల్లుబాటు అయ్యే ఫెలోషిప్ను కలిగి ఉండాలి. లేదా డిసెంబర్ 2024లో ఎన్సీబీఎస్/టీఐఎస్ఆర్ నిర్వహించిన జేజీఈఈబీఐఎల్ఎస్ పరీక్షలో హాజరై ఉండాలి.
» ఎంపిక విధానం: జేజీఈఈబీఐఎల్ఎస్ కట్అఫ్ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తులకు చివరితేది: 09.12.2025,
» ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్అయిన అర్హుల జాబితా తేదీ: 19.12.2025.
» మొదటి రౌండ్ ఇంటర్వ్యూ తేది: 05.01.2026 నుండి 07.01.2026.
» మొదటి రౌండ్ ఇంటర్వ్యూ ఫలితాలు: 07.01.2026.
» చివరి రౌండ్ ఇంటర్వ్యూ తేది: 08.01.2026 మరియు 09.01.2026.
» ఫలితాల తేది: 19.01.2026.
» వెబ్ సైట్: http://https//nccs.res.in