కెనరా బ్యాంకులో 3,500 పోస్టులు
కెనరా బ్యాంకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 3,500. (ఎస్సీ-557; ఎస్టీ-227; ఓబీసీ-845; ఈడబ్ల్యూఎస్-337; యూ ఆర్-1534)
• ఆంధ్రప్రదేశ్ లో 242,
• తెలంగాణాలో 132,
• కర్ణాటకలో 591
• తమిళనాడులో 394
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. 01.01. 2022 - 01.09.2025 మధ్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుండాలి.
వయసు: 01.09.2025 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
స్టైపెండ్: నెలకు రూ.15,000
ఎంపిక: 12వ తరగతి (హెచ్ఎస్సీ/ 10+2)/ డిప్లొమా మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్లతో,
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 12.10.2025.