Type Here to Get Search Results !
🔥 Latest Jobs

ఒత్తిడికి ఇలా చెక్ పెట్టేయండి...!

 ఒత్తిడికి ఇలా చెక్ పెట్టేయండి...!


ఎప్పుడూ సమస్యలు, ఆందోళన అని బాధపడటం వల్ల ఒత్తిడి పెరుగుతుంటుంది. అది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకేవాటిని అధిగమించి ఆనందంగా ఉండటం ఎలా అని ఆలోచన చేయాలి.



◾రోజులో మధ్య మధ్య నట్స్ తినడం ఓ అలవాటుగా మార్చుకోండి. అవి సెరటోనిన్న విడుదల చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. సెరటోనిన్ ఒత్తిడిని తగ్గించి ఆనందంగా ఉండేందుకు తోడ్పడుతుది. గుండెకు మేలు చేస్తుంది. కాబట్టి బాదం, వాల్నట్ల వంటివిరోజులో గుప్పెడు తినేలా చూసుకోండి.

◾డీహైడ్రేషన్ ఎదురైనా కూడా అది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అవసరానికి మించి ఎక్కువగా నీళ్లు తాగేవారిలో ఒత్తిడి ప్రభావం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు అలసట, చికాకు తగ్గి రోజంతా చురుగ్గా కూడా ఉంటారట.

◾కాస్త చికాగ్గా అనిపిస్తోందా.. ఏం చేయాలో తోచడం లేదా... ఇది కూడా ఒత్తిడికి సంకేతమే! అలాంటప్పుడు మీ స్నేహితులకు ఓ ఈమెయిల్ పంపండి. హాయ్ చెబుతూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోండి. దానివల్ల అలసిన మనసుకు కాస్త ఊరటగా ఉంటుంది.

◾ఒత్తిడిగా అనిపించినప్పుడు హాయిగా కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని కనీసం రెండు నిమిషాలైనా విశ్రాంతి తీసుకోండని చెబుతున్నారు అధ్యయన కర్తలు. అలా కూర్చోవడాన్ని పవర్ఫుల్ పోజ్ అంటారు. దానివల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిజాల్ స్థాయులు ఇరవై అయిదు శాతం తగ్గుతాయంటున్నారు నిపుణులు.

◾పాత ఫోటోలు చూస్తూ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకున్నప్పుడు మానసిక ఆనందం పదకొండు శాతం పెరుగుతుందట. ఇష్టమైన పాత ఫోటోలు చూడటం వల్ల ఇరవైరెండు శాతం విశ్రాంతి అందుతుందట. దీంతో కొత్త ఉత్సాహం సొంతమవుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area