Type Here to Get Search Results !

Power Grid Recruitment - పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1233 అప్రెంటిస్‌లు

Power Grid Recruitment - పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1233 అప్రెంటిస్‌లు



Power Grid Corporation of India Limited 2023 | డిప్లొమా అప్రెంటిస్ (Diploma Apprentice), ఐటీఐ అప్రెంటిస్ (ITI Apprentice), గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Graduate Apprentice), హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ (HR Excutive) త‌దిత‌ర అప్రెంటిస్‌ పోస్టుల భ‌ర్తీకి కేంద్ర విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి డిప్లొమా, ఐటీఐ, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ, ఎంఎస్‌డ‌బ్ల్యూ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1233 ఖాళీలను భర్తీ చేస్తుండ‌గా.. ఇందులో హైదరాబాద్‌ రీజియన్‌లో 70 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జూలై 01 నుంచి ప్రారంభంకాగా.. జూలై 30 వ‌ర‌కు అప్లై చేసుకోవ‌చ్చు. సంబంధిత కోర్సులో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు: 1233

పోస్టులు: డిప్లొమా అప్రెంటిస్, ఐటీఐ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్.

ప్రాంతాల వారీగా పోస్టులు: ఇందులో సౌథర్న్‌ రీజియన్‌-1 హైదరాబాద్ 70, సౌథర్న్‌ రీజియన్‌-2 బెంగళూరు 105 కార్పొరేట్‌ సెంటర్‌ (గురుగ్రామ్‌) 53, నార్తర్న్‌ రీజియన్‌ ఫరీదాబాద్ 188, నార్తర్న్‌ రీజియన్‌ జమ్మూ 79, నార్తర్న్‌ రీజియన్ లక్నో 93, ఈస్టర్న్‌ రీజియన్‌ పాట్నా 70, ఈస్టర్న్‌ రీజియన్ కోల్‌కతా 97, నార్త్‌ ఈస్టర్న్‌ రీజియన్‌ షిల్లాంగ్ 115, ఒడిశా ప్రాజెక్ట్ 47, వెస్టర్న్‌ రీజియన్‌ నాగ్‌పూర్ 105, వెస్టర్న్‌ రీజియన్ వ‌డోద‌ర 106 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: ఐటీఐ అప్రెంటిస్‌ కోసం ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, డిప్లొమా అప్రెంటిస్‌ కోసం సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ కోసం బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్‌లలో ఏదో ఒక కోర్సు.. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఎంబీఏ, ఎంఎస్‌డ‌బ్ల్యూ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.

వ‌య‌స్సు: 18 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.

ఎంపిక: సంబంధిత కోర్సులో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

స్టయిఫండ్‌: 

1. డిప్లొమా అప్రెంటీస్ పోస్టుల‌కు నెల‌కు రూ.15,000

2. ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల‌కు నెల‌కు రూ. 13,500

3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు నెల‌కు రూ. 17,500

అప్లికేష‌న్ ఫీజు: లేదు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: జూలై 01

దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: https://www.powergridindia.com/


👉 DETAILED INFORMATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area