ద న్యూ ఇండియా అస్యూరెన్స్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు
ముంబయిలోని ప్రభుత్వరంగ సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 450
పోస్టు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(జనరలిస్ట్) (స్కేల్ -1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.
జీతభత్యాలు: నెలకు సుమారు రూ.80,000. వయోపరిమితి: 2023 ఆగస్టు 1 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100
విభాగాలు, ఖాళీలు:
1. రిస్క్ ఇంజనీర్ 36 పోస్టులు పోస్టులు
2. ఆటోమొబైల్ ఇంజనీర్లు 96
3. లీగల్ 70 పోస్టులు
4. ఆకౌంట్స్ 30 పోస్టులు
5. హెల్త్ 75 పోస్టులు
6. బిటీ 23 పోస్టులు.
7. జనరలిస్ట్ 120 పోస్టులు
ఎంపిక ప్రక్రియ: ప్రాథమిక రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 1
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 21
వెబ్సైట్: https://www.newindia.co.in/portal/