Type Here to Get Search Results !

ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులు

 ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులు



పదోతరగతి ఉత్తీర్ణులై సర్కారీ కొలువు కోసం అన్వేషిస్తున్న అభ్యర్థు లకు తీపి కబురు. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవింగ్ లైసెన్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూలై 26 తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 458 

పోస్టుల వివరాలు: కానిస్టేబుల్ (డ్రైవర్) గ్రూప్-సి, నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్)-458 పోస్టులు (యూఆర్-195, ఎస్సీ- 74, ఎస్టీ-37, ఓబీసీ-110, ఈడ బ్ల్యూఎస్-42)

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సం స్థ నుంచి మెట్రిక్యురేషన్ లేదా పదోత రగతి ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ (హెచ్ ఎంవీ) కలిగి ఉండాలి. • వయసు: 21 నుంచి 27 ఏళ్లు మధ్య ఉండాలి. రిజ ర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరి మితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక ఇలా: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈ టీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారం గా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పీఈటీ, పీఎసీ అర్హత పరీ క్షలు. కాగా రాత పరీక్ష 100 మార్కు లకు, డ్రైవింగ్ టెస్ట్ 50 మార్కులకు ఉంటాయి.

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీ ఎస్ టీ)  

ఎత్తు: అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులు 170 సెం.మీ; అస్సాం, హిమాచల్ ప్రదేశ్: జమ్మూ కాశ్మీర్, లద్దార్కు చెందిన గుర్కాస్, డోగ్రాస్ తదితర ప్రత్యేక వర్గాలు వారు 165 సెం.మీ, కొండ ప్రాంతా లోని నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల వారు 162.5 సెం.మీ. ఎత్తు, ఇతరులు 160 సెం.మీ ఎత్తు ఉండాలి. అలాగే ఛాతీ ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు 80-85 మధ్య వ్యత్యాసం ఉండాలి. ప్రత్యేక వర్గాల వారికి 5 సెం.మీ సడలింపు వర్తిస్తుంది.

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ): ఈ పరీక్షలో భాగంగా 1.6 మీటర్ల దూరాన్ని పురుషులు 7.30 నిమి షాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 11 ఫీట్ల లాంగ్ జంప్ ను మూడు ప్రయ త్నాల్లో, 3 1/2 ఫీట్ హైజంపు 3 ప్రయత్నాల్లో పూర్తిచేయాలి.

రాత పరీక్ష: ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ 10 ప్రశ్నలు- 10 మార్కులు, మ్యాథ మెటిక్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు. హిందీ 10 ప్రశ్నలు-10 మార్కులు, ఇంగ్లిష్ 10 ప్రశ్నలు- 10 మార్కులు, ట్రేడ్ రిలేటెడ్ థియరీ క్వశ్చన్స్ 60- ప్రశ్నలు 60 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.

డ్రైవింగ్ టెస్ట్: రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని షార్టిస్ట్ చేసి డ్రైవింగ్ టెస్ట్కు పిలుస్తారు. ఈ పరీక్షకు 30 మార్కులు ఉంటాయి.ఇందులో భాగంగా ప్రత్యే కంగా డిజైన్ చేసిన ట్రాక్స్ మీద హెవీ అండ్ లైట్ మోటర్ వెహికిల్స్కు సం బంధించి ప్రాక్టికల్ టెస్టులను నిర్వహి స్తారు. ఇవే కాకుండా వెహికల్ మె యింటెన్స్, వివిధ పరిస్థితుల్లో డ్రైవిం గ్ చేసే విధానాన్ని గమనిస్తారు. '

తుది ఎంపిక: రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్టులో ఎంపి కైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు మెడికల్ టెస్టు లను నిర్వహించి తుదిగా ఎంపిక చేసి.. ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

వేతనాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే లెవల్-3 ప్రకారం రూ.21,700 - 69, 100 వరకు వేతన శ్రేణి లభిస్తుంది.

ముఖ్యసమాచారం:

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 26, 2023 

వెబ్సైట్: https://itbpolice.nic.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area