Type Here to Get Search Results !

ఏకలవ్య పాఠశాలల్లో 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులు

 ఏకలవ్య పాఠశాలల్లో 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులు



దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల (ఈఎంఆర్ఎస్)లో 6,329 పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

1. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్, ఆర్ట్, పీటీటీ (మేల్), పీఈటీ (ఫిమేల్), లైబ్రేరియన్.

2. హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు

3. హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు 

అర్హత: 

• టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్.

• టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ.

• టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్ఎస్ఐఎస్సీ. 

వయసు: 18.8.2023 నాటికి 18 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

వేతన శ్రేణి: 

• టీజీటీ ఉద్యోగాలకు రూ.44900-142400/ రూ. 35400-112400, 

• హాస్టల్ వార్డెన్ కి రూ. 29,200-92300.

ఎంపిక: ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

పరీక్ష: 

• ఓఎంఆర్ ఆధారిత (పెన్ పేపర్) విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. 

• టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులు (120 ప్రశ్నలు), 

• లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్టుకు 30 మార్కులు (30 ప్రశ్నలు) కేటాయించారు. 

• హాస్టల్ వార్డెన్ రాత పరీక్షకు 120 మార్కులు (120 ప్రశ్నలు) ఉంటాయి. 

• టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్ వార్డెన్ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు రుసుము: టీజీటీ రూ.1500, హాస్టల్ వార్డెన్ రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-08-2023,

వెబ్ సైట్: https://emrs.tribal.gov.in/


DOWNLOAD DETAILED NOTIFICATION

APPLY FOR THE POST OF TGT

APPLY FOR THE POST OF HOSTEL WARDEN

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area