రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో జూనియర్ ఇంజనీర్ పోస్టులు
ముంబయి ప్రధాన కేంద్రంగా గల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ).. వివిధ విభాగాల్లో జూని యర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు:
• జూనియర్ ఇంజినీర్ (సివిల్) -29
• జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 06
అర్హత: డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో 65 శాతం మార్కు లతో ఉత్తీర్ణత సాధించాలి. (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు, 55 శాతం ఉండాలి). సంబంధిత విభాగంలో ఏడాది నుంచి రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయసు: 01.08.2023 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి(ఎస్సీ,ఎస్టీ, బీసీలకు మినహా యింపు ఉంటుంది.)
వేతనం: రూ.33,900 - రూ.71,032
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 30.06. 2023.
పరీక్ష తేది: 15.07.2023
వెబ్సైట్: www.rbi.org.in