Type Here to Get Search Results !
🔥 Latest Jobs

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పోలీస్‌ నోటిఫికేషన్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పోలీస్‌ నోటిఫికేషన్‌



స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ తాజాగా ఢిల్లీ పోలీస్, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ ద్వారా ఢిల్లీ పోలీస్‌తోపాటు సీఏపీఎఫ్‌లో మొత్తం 4,300 ఎస్‌ఐ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇందులో సీఏపీఎఫ్‌లో 3960 పోస్టులు ఉండగా.. ఢిల్లీ పోలీసు విభాగంలో 340 ఖాళీలు ఉన్నాయి. 

అర్హతలు :

విద్యార్హత: ఆగస్ట్‌ 30, 2022 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు : జనవరి 1, 2022 నాటికి 20–25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

వేతన శ్రేణి : రూ.35,400–రూ.1,12,400

శారీరక ప్రమాణాలు :

►ఎస్‌ఎస్‌సీ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విద్యార్హతలు, వయో పరిమితితో΄పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. 

►పురుష అభ్యర్థులు కనీసం 170 సెంటీ మీటర్లు; మహిళా అభ్యర్థులు 157 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. అదే విధంగా పురుష అభ్యర్థులకు నిర్దేశిత ఛాతీ కొలతలు తప్పనిసరి.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

దరఖాస్తులకు చివరి తేది : ఆగస్ట్‌ 30,2022

ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం : సెప్టెంబర్‌ 1

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ : నవంబర్‌లో

►తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area